Kavitha : ‘సింగరేణి జాగృతి’ పేరుతో కవిత కమిటీ ఏర్పాటు
Kavitha : టీబీజీకేఎస్‌తో సమన్వయం చేస్తూ ముందుకు సాగబోతున్న ఈ ఉద్యమం, ఆరోగ్య శిబిరాలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి శిక్షణలు మొదలైన కార్యక్రమాలను ప్రారంభించనుంది
- By Sudheer Published Date - 04:04 PM, Tue - 27 May 25

తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తాజా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీపై అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసిన ఆమె, ‘సింగరేణి జాగృతి’ (Singareni Jagruti) అనే పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సింగరేణి ప్రాంతానికి చెందిన కార్యకర్తలతో సమావేశమై, 11 ఏరియాల వారీగా కమిటీకి కోఆర్డినేటర్లను నియమించడంతో ఈ కమిటీకి కార్యాచరణ మొదలైంది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఈ సంస్థ రూపొందించామని కవిత స్పష్టం చేశారు.
Tata Motors : టాటా హారియర్ EV అనౌన్స్మెంట్ ముందు రోడ్డు పై ప్రయోగం
కవిత ప్రకారం.. ‘సింగరేణి’ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకలాంటిది. కార్మిక హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ కమిటీ కార్యాచరణ చేపట్టనుంది. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేస్తూ ముందుకు సాగబోతున్న ఈ ఉద్యమం, ఆరోగ్య శిబిరాలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి శిక్షణలు మొదలైన కార్యక్రమాలను ప్రారంభించనుంది. మహిళల ఆత్మవిశ్వాసం పెంచే ప్రత్యేక శిక్షణల ద్వారా సామాజిక స్థాయిని పెంచేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు.
ఇక ఈ సమావేశంలో కవిత.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “కేసీఆర్ పాలనలో ఉద్యోగాలను పునరుద్ధరించి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించామని” గుర్తుచేసిన ఆమె, “ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చర్యలతో సింగరేణి సంస్థను గల్లంతు చేయాలనుకుంటోంది” అంటూ ఆరోపించారు. ముఖ్యంగా లేబర్ కోడ్‌పై సీఎం మౌనం, మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు.