HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Reveal About Letter To Kcr

kavitha Letter : కాంగ్రెస్ , బిజెపి సంబరాలను ఆవిరి చేసిన కవిత

kavitha Letter : ఈ లేఖను ఆసరాగా చేసుకొని బిజెపి , కాంగ్రెస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం , ఇదే సందర్భంలో పలువురు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని ప్రచారం చేయడం తో రాష్ట్రం మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ లో ఏంజరగబోతుంది..? కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా..? వైస్సార్ ఫ్యామిలీ లాగా కేసీఆర్ ఫ్యామిలీ విడిపోతుందా ..? అంటూ ఖంగారు పడ్డారు.

  • Author : Sudheer Date : 23-05-2025 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Letter Clarty
Kavitha Letter Clarty

రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ కూతురు కవిత (Kavitha) గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కు కవిత లేఖ (kavitha Letter) రాయడం , ఆ లేఖ లో పలు అంశాలు ప్రస్తావించడం..ఈ లేఖను ఆసరాగా చేసుకొని బిజెపి , కాంగ్రెస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం , ఇదే సందర్భంలో పలువురు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని ప్రచారం చేయడం తో రాష్ట్రం మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ లో ఏంజరగబోతుంది..? కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా..? వైస్సార్ ఫ్యామిలీ లాగా కేసీఆర్ ఫ్యామిలీ విడిపోతుందా ..? అంటూ ఖంగారు పడ్డారు. అయితే శుక్రవారం అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చిన కవిత లేఖ పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

UAE లో పుట్టిన దగ్గరి నుండి చనిపోయే వరకు అంత ఫ్రీ..ఫ్రీ అబ్బా భలేగా ఉందే..!

రెండు వారాల కింద కేసీఆర్ కు లేఖ రాసింది వాస్తవమేనని , కానీ ఈ లేఖ ఎలా బహిర్గతం అయిందో తేలాలని అన్నారు. కేసీఆర్ కు గతంలో ఎన్నోసార్లు లేఖ రాశానని, కానీ ఇప్పుడు లేఖ లీక్ కావడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి యావత్ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది లేఖలో వెల్లడించానని చెప్పిన కవిత.. తనకు వ్యక్తిగత ఎజెండా ఏం లేదని స్పష్టం చేశారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె అయిన తాను రాసిన లేఖ లీక్ అయింది..పార్టీలో నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు అన్నారు.

కేసీఆర్ దేవుడు అని,ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని వారి వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు కవిత. కోవర్టులను తొలగించుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు.ఇటీవలే కుట్రలు , కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పానని, తాను ఈ విషయం చెప్పిన కొద్ది రోజులకే ఈ లేఖ బహిర్గతం అయిందంటే ఏం జరుగుతుందో ఆలోచించాలని అన్నారు. అయితే, ఎవరు ఆమెపై కుట్రలు చేస్తున్నారు అనే ప్రశ్నకు కవిత నేరుగా సమాధానం ఇవ్వకపోయినా, పార్టీలో ఉన్న కీలక నేతలే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడిందని , కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ లేఖ అంశాన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా సంబరపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ‘కేసీఆరే మా నాయకుడు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం’ అని పునరుద్ఘాటించిన కవిత, లేఖ రాయడంలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kavitha
  • Kavitha Letter
  • Kavitha New Party
  • Kavitha vs KCR
  • kcr
  • MLC Kavitha

Related News

    Latest News

    • ఐపీఎల్ 2026లో స‌రికొత్త రికార్డు.. మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు!

    • బోణీ కొట్టిన హైద‌రాబాద్‌.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!

    • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

    • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

    • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

    Trending News

      • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

      • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

      • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

      • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd