HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Kavitha Hunger Strike In Delhi For Womens Reservation

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష

  • By Balu J Published Date - 04:48 PM, Thu - 2 March 23
  • daily-hunt
Kavitha
Kavitha

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రకటించారు. గురువారం నాడు తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బిజెపి చేర్చిందని, ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని అన్నారు. తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలి అన్న లక్ష్యంతో పని చేసి, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జంతర్మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయించామని వెల్లడించారు.

మహిళలు రాజకీయ రంగంలో ముందు ఉండాలంటే రిజర్వేషన్ తోనే సాధ్యమవుతుందని భారత్ జాగృతి విశ్వసిస్తుందని (MLC Kavitha) తెలిపారు. మార్చి 8 న హోళీ పండుగ ఉన్నందును మార్చి 10 న ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని, మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని తెలిపారు. కానీ రిజర్వేషన్ కల్పించని భారత్ వంటి దేశాలు ఆ లక్ష్యాన్ని చేసుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పారు. ఇందులో రాజకీయమేమీ లేదని, సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్ పవర్, విశ్వగురువు గా చేయలేరని విమర్శించారు.

నిరాహార దీక్షకు అన్ని మహిళా సంఘాల ప్రతినిధులను, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని తెలిపారు. రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే భారత్ (India) లాంటి దేశాల్లో రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు కవిత అన్నారు. గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం కనీసం జనగణన కూడా చేయలేదన్న ఎమ్మెల్సీ కవిత.. జనగణనతో పాటు, ఓబీసీ జనగణన సైతం చేయాలని డిమాండ్ చేశారు. 2010 లో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయినప్పుడు కొన్ని పార్టీలు ఉపకోటా ఉండాలని డిమాండ్ చేశాయని, ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్దంగా ఉపకోటా ఉండాలి అన్నది తమ కోరిక అని అన్నారు ఎమ్మెల్సీ ‌కవిత. పోలీసుల అనుమతి ప్రకారం మార్చి 10 న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళలతో కలిసి జంతర్ మంతర్ లో దీక్ష చేస్తామని తెలిపారు.

1992 లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని, 1993 లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని ఎమ్మెల్సీ ‌కవిత తెలిపారు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయన్న ఎమ్మెల్సీ ‌కవిత, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు గాను పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించడంతో పాటు, మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యామ్నాయాలు కూడా సూచించారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) గుర్తు చేశారు. పార్లమెంట్ ఎంపీల సంఖ్యను 33 శాతం పెంచి మహిళలకు కేటాయించాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. 1952 లో మొదటి లోక్ సభలో 24 మహిళా ఎంపీలు ఉండగా, ప్రస్తుతం 78 మహిళా ఎంపీలు ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత, 75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మహిళల ప్రాతినిధ్యం అనుకున్నంతగా లేదన్నారు. 10 న జంతర్ మంతర్ లో నిర్వహించే ధర్నాకు అన్ని రాష్ట్రాల నుండి వివిధ మహిళా సంఘాల నేతలు, రాజకీయ నేతలు పాల్గొననున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం (BJP Govt), మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేంద్ర విచారణ సంస్థలతో విచారణ చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వం, అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదశించలేదని, అదానీ కుంభకోణం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే గ్యాస్ సిలిండర్ల ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచిందా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతోనే అదానీపై విచారణ మొదలైందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికల సంఘం బీజేపీ, మోదీ కబంధ హస్తాల నుండి బయటపడిందన్నారు. గతంలో జరిగిన సంఘటనలు చూస్తే, ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నయన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో మహిళల రక్షణపై బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడదన్న ఎమ్మెల్సీ కవిత నిందితులు ఎలాంటి వారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి , జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Also Read: BRS Protest: గ్యాస్ ధరల పంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi BRS
  • kavitha kalvakunta
  • protest
  • reservation

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd