Green India Challenge : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో అడవిని కబ్జా చేయాలనీ సంతోష్ రావు ప్లాన్ – కవిత
Green India Challenge : సంతోష్ రావు ధనదాహం ఉన్న వ్యక్తి అని, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆమె విమర్శించారు. నేరెళ్ల ఇసుక దందా, దళితులను చిత్రహింసలు పెట్టడం వంటి ఘటనల వెనుక సంతోష్ రావే ఉన్నారని కవిత ఆరోపించారు
- By Sudheer Published Date - 01:34 PM, Wed - 3 September 25

బీఆర్‌ఎస్ (BRS) పార్టీలో అంతర్గత విబేధాలు బహిరంగమయ్యాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), మాజీ ఎంపీ సంతోష్ రావు(Santhosh Rao)పై తీవ్ర ఆరోపణలు చేశారు. సంతోష్ రావు ధనదాహం ఉన్న వ్యక్తి అని, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆమె విమర్శించారు. నేరెళ్ల ఇసుక దందా, దళితులను చిత్రహింసలు పెట్టడం వంటి ఘటనల వెనుక సంతోష్ రావే ఉన్నారని కవిత ఆరోపించారు.
Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం
సంతోష్ రావు అవినీతి, అక్రమాల వల్ల పార్టీకి, ముఖ్యంగా కేటీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందని కవిత పేర్కొన్నారు. పోచంపల్లి శ్రీనివాస్, నవీన్ రావులకు పదవులు, కాంట్రాక్టులు ఇప్పించింది కూడా సంతోష్ రావేనని ఆమె అన్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India Challenge) పేరుతో సంతోష్ రావు నకిలీ కార్యక్రమాన్ని నిర్వహించారని, పబ్లిసిటీ కోసం చిరంజీవి, ప్రభాస్ వంటి సినీ హీరోలను మోసం చేశారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను, ఆర్థికపరమైన అక్రమాలను స్పష్టం చేస్తున్నాయి. ఒక మహిళా నేతగా తనను పార్టీ నుంచి బయటకు పంపించడంలో సంతోష్ రావు కీలక పాత్ర పోషించారని కవిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.