MLC Kavitha : హరీష్ రావు వల్లే కేసీఆర్ మీద మరక.. తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద కలకలం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణ పరిణామాలకు అసలైన కారణం కుటుంబంలో కొందరేనని ఆమె బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు.
- By Kavya Krishna Published Date - 04:59 PM, Mon - 1 September 25

MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద కలకలం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణ ఈ పరిణామాలకు అసలైన కారణం కుటుంబంలో కొందరేనని ఆమె బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ సంతోష్‌రావులపై ఘాటు ఆరోపణలు చేశారు. కవిత మాట్లాడుతూ.. “మా నాన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తరతరాలకు నిలిచిపోయే ఆస్తి ఇచ్చారు. తొలి సారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి నీళ్లు ఎలా తేవాలో ఆరు ఏడు నెలలపాటు కష్టపడి ప్రణాళికలు రూపొందించారు. ఆయనకు తిండి మీదా, డబ్బు మీదా ఎప్పుడూ యావ ఉండదు. అలాంటి వ్యక్తిని అవినీతి ఆరోపణలతో నిందించడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Vladimir Putin : ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు
“కేసీఆర్‌కు అవినీతి మరక ఎవరి వల్ల వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న కొందరి వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అయినా వారినే మోస్తున్నారు. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటడానికి ప్రధాన కారణం హరీష్ రావు. అందుకే ఆయనను రెండోసారి ఇరిగేషన్ మంత్రి పదవికి దూరం చేశారు” అన్నారు. “హరీష్ రావు, సంతోష్ రావు నాపై ఎన్నో కుట్రలు చేశారు. వీరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మా నాన్నలాంటి దేవుని మనిషిపై సీబీఐ విచారణ జరగడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఈ పేర్లు బయట పెట్టలేదు. కానీ ఇక మౌనం వహించడం కష్టం. పార్టీకి, కేసీఆర్‌కి నష్టం జరిగినా సరే, నేను నిజాలు చెబుతున్నా” అని స్పష్టం చేశారు.
కవిత పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. “కేసీఆర్‌పై విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు? ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఎందుకు ఇలా మౌనం వహిస్తోంది? ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఈ పరిణామాల వెనుక ఉన్నారని చెప్పకుండా ఉండలేను. ఆయన, సంతోష్ తమ ఆస్తులు పెంచుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఉపయోగించుకున్నారు” అని ఆరోపించారు. కవిత తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ, “నాపై కుట్రలు చేసినా భరించాను. కానీ మా నాన్నపై ఆరోపణలు తట్టుకోలేకపోతున్నా. ఈ వయసులో ఆయనపై సీబీఐ విచారణ జరగడం అసహ్యం కలిగిస్తోంది. ఎంతవరకు వెళ్లినా నేను తేల్చుకుంటా. ఇటువంటి దుర్మార్గులను ఎందుకు భరించాలి?” అని వ్యాఖ్యానించారు.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్ల వాడకంపై నిషేధం!