Nagarjuna : నాగార్జునపై కేసు నమోదు చేయండి.. పోలీసులకు భాస్కర్ రెడ్డి ఫిర్యాదు
చెరువు స్థలాన్ని కబ్జా చేయడం ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను నాగార్జున(Nagarjuna) ఉల్లంఘించారని, పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
- By Pasha Published Date - 12:38 PM, Sat - 5 October 24

Nagarjuna : హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించినందుకు హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువును నాగార్జున కబ్జా చేసినట్లుగా ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించిన ఆధారాలను జతపరిచి ఆయన ఈ కంప్లయింట్ ఇచ్చారు. మాదాపూర్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు.
Also Read :600 Massacred : 600 మందిని పిట్టల్లా కాల్చి చంపిన ఉగ్ర రాక్షసులు
‘‘హైదరాబాద్‌లోని శిల్పారామం ఎదుటనున్న అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలం ఉంది. అందులో 3 ఎకరాల 30 గుంటల భూమిని నాగార్జున ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించారని ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2021 ఫిబ్రవరి 17న నివేదిక ఇచ్చారు’’ అని కంప్లయింట్‌లో కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రస్తావించారు. కబ్జాకు గురైన ఈ భూమి విలువ వందల కోట్లు ఉంటుందన్నారు. చెరువు స్థలాన్ని కబ్జా చేయడం ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను నాగార్జున(Nagarjuna) ఉల్లంఘించారని, పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
Also Read :Kumari Selja : నాకు స్వాగతం పలకడానికి బీజేపీ రెడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
ఇటీవలే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని ఫ్యామిలీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగ్ కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలను తెలుగు మూవీ ఇండస్ట్రీ ఖండించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ పరిణామం జరిగిన వెంటనే ఇప్పుడు నాగార్జునపై పోలీసులకు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేయడం గమనార్హం. రాష్ట్రంలో చెరువుల పరిరక్షణకు కాంగ్రెస్ సర్కారు హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేసింది. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్, నాళాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మితమైన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. హీరో నాగార్జున తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపిస్తూ దాన్ని హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే.