Telangana: ఎన్నికలపై కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గిన మందు పార్టీలు, అభ్యర్థులు ఫుల్ జోష్!
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంటే బీరు, బీర్యానీ, మందు ఏరులై పారాల్సిందే.
- By Balu J Published Date - 12:02 PM, Sat - 18 November 23

Telangana: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంటే బీరు, బీర్యానీ, మందు ఏరులై పారాల్సిందే. ఏమాత్రం తగ్గినా కార్యకర్తలు తగ్గేదేలే అంటూ సభలు, సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ నేతలు కూడా ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటారు. కార్యకర్తలు, అభిమానులకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేల అభ్యర్థులు కార్యకర్తల కోసం భాగానే ఖర్చు పెట్టారు. మద్యం పోయడానికే ఎక్కువగా ఖర్చుపెటిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో నేతలకు కార్తీక మాసం కొలిసి వచ్చింది.
ఈ పవిత్ర మాసంలో మద్యం వినియోగం చాలా తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. చాలా మంది పోటీదారులు పోలింగ్ తేదీకి కనీసం రెండు రోజుల ముందు ఓటర్లను ప్రలోభపెట్టడానికి పెద్ద మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేస్తారు. కార్తీక మాసం రావడంతో ఈసారి మద్యం, బిర్యానీ ఖర్చు కొంత తప్పినట్టయిందని సంబర పడుతున్నారు.
చాలామంది కార్యకర్తలు కూడా కార్తీక మాసం సెంటిమెంట్ తో మద్యం, మటన్ పార్టీలకు దూరంగా ఉంటుండటం గమనార్హం. కాగా అక్టోబరు 9 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే, హైదరాబాద్‌లో 229 మంది అరెస్టు అయ్యారు. మాదకద్రవ్యాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా మద్యం కలిగి ఉన్నందుకు మొత్తం 404 కేసులు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Also Read: MLC Kavitha: ధాన్యపు రాశుల తెలంగాణ.. వీడియో చిత్రీకరించిన కవిత
Related News

Rain Forecast : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే చాన్స్
గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.