KTR: గద్వాలలో కర్ణాటక రైతుల నిరసన, కేటీఆర్ మరో ట్వీట్
కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ వద్ద మొసలితో నిరసన చేసిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 04:06 PM, Tue - 24 October 23

KTR: కర్ణాటకలో తిరుగులేని అధికారం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర రైతులు చుక్కలు చూపిస్తున్నారు. కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ వద్ద మొసలితో నిరసన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సోషల్ మీడియా వేదిగా వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి మరోసారి గద్వాలలో కర్ణాటక రైతులు నిరసనకు దిగారు. ‘‘కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నయ్.. కాంగ్రెస్ చేతిలో.. మేం మోసపోయాం. మీరు మోసపోకండి..! తెలంగాణ రైతన్నలకు విజ్ఞప్తి చేసిన కన్నడ అన్నదాతలు’’ అంటూ నిరసనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మరోసారి కేటీఆర్ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.
ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో 😄 https://t.co/oGp0pJhgZV
— KTR (@KTRBRS) October 24, 2023
Also Read: Telangana TDP: చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్, తెలంగాణ అసెంబ్లీ బరి నుంచి టీడీపీ ఔట్!