KA Paul : మునుగోడులో మన గెలుపు ఖాయం..50వేల మెజార్టీతో గెలుస్తున్నాం…!!
- Author : hashtagu
Date : 04-11-2022 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు మాత్రం విజయం తమదే అంటూ ధీమాగా ఉన్నాయి. అయితే ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మునుగోడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులు ప్రధానపార్టీలు మూడు గెలవయన్నారు. స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. అన్ని చోట్లా తనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని…80శాతం వరకు తనకు ఓట్లు పడ్డాయన్నారు. తాను 50వేల మెజార్టీతో విజయం సాధిస్తానని కేఏపాల్ చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది…చివరకు తుస్సుమనిపించారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతామని తెలిసి రూ. 500ఇచ్చింది. యువత మీరు అస్సలు నిరాశపడకండి. మనకు మంచిరోజులు వచ్చాయి. లక్షా 50వేల మంది యువత మనకు ఓటు వేశారు. అన్ని చోట్లో 60శాతం ఓట్లు మనకే వేశారు. కేసీఆర్ ను చిత్తుగా ఓడిస్తున్నాం. 50వేల మెజార్టీతో గెలుస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవీఎంలను కాపాడుకుందామంటూ కేఏపాల్ అన్నారు. నవంబర్ 6న ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది.