BRS Effect : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభం
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించడం తో బిఆర్ఎస్ దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చిందని కామెంట్స్ చేయడం చేస్తున్నారు
- By Sudheer Published Date - 05:03 PM, Sat - 27 July 24

శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లోని లింక్ -2లో ఎత్తిపోతలు (Nandi Medaram 4 And 6th Motors On) ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో అధికారులు మోటార్లు ఆన్ చేసి నీటిని వదిలారు. దీనిపై బిఆర్ఎస్ (BRS) పార్టీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. నిన్న బిఆర్ఎస్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి..ఈరోజు ఎత్తిపోతలు ప్రారంభించారని ట్వీట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం.
We’re now on WhatsApp. Click to Join.
దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో పలు లోపాలు ఉన్నాయని..కాంగ్రెస్ విమర్శించడం మొదలుపెట్టింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ లోని ఓ పిల్లర్ కుంగడంతో కాంగ్రెస్ నానా హడావిడి చేసింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోతుందంటూ..నాణ్యత లోపం వల్ల ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాకుండా పోయిందని..ప్రజల సొమ్ము వృధా అయ్యిందంటూ విమర్శలు చేసింది. ప్రస్తుతం మేడిగడ్డకు భారీగా వరద వస్తున్న క్రమంలో బిఆర్ఎస్ బృందం తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తప్పుగా ప్రచారం చేస్తూ..కేసీఆర్ ఫై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని..మేడిగడ్డకు ఏమి కాలేదని పేర్కొంది.
ఇక ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించడం తో బిఆర్ఎస్ దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చిందని కామెంట్స్ చేయడం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్లను ఆన్ చేసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు మరో 3 పంపులు ఆన్ చేసే అవకాశం ఉంది. గాయత్రి పంప్ హౌస్‌కు 6,240 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరుకు జలాలు తరలిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్..
ఈరోజు కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ఎత్తిపోతలు షురూ చేసిన రేవంత్ సర్కార్!
Exclusive Visuals https://t.co/W8i6lZgrC4 pic.twitter.com/Hc1g52HAev
— BRS Party (@BRSparty) July 27, 2024
Read Also :