Sutanu Guru : బలహీన ప్రతిపక్షమే మోడీ బలం : సీనియర్ జర్నలిస్ట్ సుతను గురు
Sutanu Guru : ‘సీఓటర్’ (Cvoter) సంస్థ యావత్ దేశానికి సుపరిచితం. ఎన్నికల వేళ ఆ సంస్థ నిర్వహించిన సర్వేల ఫలితాలను మనమంతా చూస్తుంటారు.
- By Pasha Published Date - 09:53 AM, Sat - 30 March 24

Sutanu Guru : ‘సీఓటర్’ (Cvoter) సంస్థ యావత్ దేశానికి సుపరిచితం. ఎన్నికల వేళ ఆ సంస్థ నిర్వహించిన సర్వేల ఫలితాలను మనమంతా చూస్తుంటారు. సీఓటర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుతను గురు ‘ఇండియా టు భారత్’ పేరిట 90 రోజుల దేశయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా నియో సైన్స్ హబ్(ఎన్ఎస్ హెచ్) మీడియాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మాసపత్రిక ‘స్మార్ట్ ల్యాబ్ టెక్’ ఏర్పాటు చేసిన ప్రెస్ ఇంటరాక్టివ్ సెషన్‌లో ముఖ్య అతిథిగా సుతను గురు పాల్గొని ప్రసంగించారు.
We’re now on WhatsApp. Click to Join
దేశ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రస్తుత ప్రతిపక్షం విఫలమైందని సుతను గురు (Sutanu Guru) అభిప్రాయపడ్డారు. ‘‘దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేదు. కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. అయితే, సగటు ఓటరు మాత్రం మళ్లీ నరేంద్ర మోడీవైపే మొగ్గు చూపొచ్చు. దీనికి కారణం ప్రజలకు ప్రతిపక్షాలపై నమ్మకం లేకపోవడమే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. తాను చేస్తున్న ‘ఇండియా టు భారత్’ యాత్ర రాజకీయాలకు అతీతం కాదు గానీ, రాజకీయ నాయకులకు మాత్రం ఎంతో దూరమని స్పష్టం చేశారు. 90 రోజుల యాత్రలో ఇప్పటికే 60 రోజులు పూర్తయ్యాయని, మరో 30 రోజుల ప్రయాణమే మిగిలిందన్నారు. ఈ ప్రయాణంలో తాను ఏ ఒక్క రాజకీయ నాయకున్ని కూడా కలవలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని సామాన్యుడి ఆలోచనలు తెలుసుకొని, అభిప్రాయాలు పంచుకొని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవడమే తన యాత్ర అంతరార్థమని వెల్లడించారు.
Also Read :Pin Messages : వాట్సాప్ ఛాట్‌లో ఇక 3 మెసేజ్‌లను పిన్ చేయొచ్చు
‘‘దేశంలోని ఏ పార్టీ అవినీతికి అతీతం కాదనే స్పష్టత ప్రజలందరికీ ఉంది. అసలు అవినీతి అనేది ఎన్నికల్లో అంశమే కావడం లేదు’’ అని సుతను గురు చెప్పారు. స్థానిక అవసరాలు, తమ సమస్యలు తీర్చే నాయకులకే ఓట్లు వేసుకునే చైతన్యం ప్రజల్లో వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు ఉత్తరాదికి కొత్త గానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయని కాబట్టి మోదీ సంక్షేమ పథకాల మంత్రం దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయడం లేదని పేర్కొన్నారు. ‘‘ముస్లిం ఓటర్లు కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే, హిందువులమని ప్రకటించుకోవడానికి, తమ ఉనికిని గుర్తించబడటానికీ హిందువులు గతంలోలా సంకోచించకపోవడం బీజేపీకి కొంత ఊరట కలిగించే అంశం’’ అని సుతను గురు విశ్లేషించారు.
Also Read :Exit Polls : నో ‘ఎగ్జిట్ పోల్స్’.. ఈసీ కీలక ప్రకటన
ఎన్ఎస్ హెచ్ మీడియా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తన అనుభవాలు పంచుకోవడానికి అంగీకరించిన సుతనుకు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ వెంకట సత్యప్రసాద్ పోతరాజు కృతజ్ఞతలు తెలిపారు. నవతరానికి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని కలిగించి, వారిలో శాస్త్రీయ భావాలని పెంపొందించాలనే ఆదర్శంతోనే నియో సైన్స్ (ఎన్ఎస్‌హెచ్) మీడియాను స్థాపించి ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. ఎన్ఎస్ హెచ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుబ్రమణియన్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం సాగింది. దీనికి సీనియర్ పాత్రికేయుడు, రచయిత, రాకా సుధాకర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. రెష్మీ కుమారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు సోమశేఖర్, కూర్మనాథ్, వాయువేగుల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.