HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Job Application Deadline Extended For Assistant Engineer And Chemist Posts In Telangana Genco

Telangana Genco Jobs : ఎమ్మెస్సీ, బీటెక్ చేసిన వారికి జెన్‌కోలో జాబ్స్

Telangana Genco Jobs : తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

  • By Pasha Published Date - 09:54 AM, Sun - 22 October 23
  • daily-hunt
Telangana Genco Jobs
Telangana Genco Jobs

Telangana Genco Jobs : తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఈ అప్లికేషన్ల స్వీకరణ గడువు ఈనెల 29తో ముగియాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సౌకర్యార్ధం దరఖాస్తు గడువును నవంబరు 10 వరకు పొడిగించారు. నవంబరు 10న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులను అభ్యర్థులు సబ్మిట్ చేయొచ్చు. ఇక దరఖాస్తులలో ఏవైనా వివరాలను తప్పుగా ఎంటర్ చేసి ఉంటే..  ఏఈ పోస్టులవారు నవంబర్‌ 14లోగా, కెమిస్ట్‌ పోస్టుల వారు నవంబరు 15లోగా సవరించుకోవచ్చు.  ఇక ఎగ్జామ్ డేట్ ను కూడా డిసెంబరు 3 నుంచి డిసెంబర్‌ 17కు మార్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏఈ పోస్టులు ఏ విభాగాల్లో ఎన్ని.. 

మొత్తం 339 ఏఈ పోస్టులలో 94 జాబ్స్ ను లిమిటెడ్  కేటగిరిలో, 245 పోస్టులను జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. ఏఈ పోస్టులు ఎలక్ట్రికల్ విభాగంలో 187, మెకానికల్ విభాగంలో 77, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 25, సివిల్ విభాగంలో 50 ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు ఈ జాబ్ కు అర్హులు. ఈ ఏడాది జులై 1 నాటికి 18-44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇతర రాష్ట్రాలవారికి ఈ మినహాయింపు వర్తించదు. ఆన్‌లైన్లో అప్లికేషన్ సమర్పించాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో 2 సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ‘సెక్షన్-ఎ’లో అభ్యర్థుల సబ్జెక్ట్ (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ‘సెక్షన్-బి’లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. ఈ జాబ్ కు ఎంపికయ్యే వారికి పే స్కేలు  రూ.65,600 – రూ.1,31,220 దాకా ఉంటుంది.

Also Read: Brain Healthy: మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గించుకోండి ఇలా..!

కెమిస్ట్ పోస్టులకు అర్హత ఏమిటి..

కెమిస్ట్ పోస్టులు మొత్తం 60 ఉన్నాయి. వీటిలో 3 పోస్టులను లిమిటెడ్ కేటగిరిలో, 57  పోస్టులను జనరల్ కేటగిరిలో భర్తీ చేస్తారు. ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విభాగంలో ప్రథమ శ్రేణిలో పాసైన వారు ఈ జాబ్ కు అర్హులు.  ఈ ఏడాది జులై 1 నాటికి 18-44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.400, పరీక్ష ఫీజుగా రూ.300 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలవారికి ఈ మినహాయింపు వర్తించదు. ఆన్‌లైన్లో అప్లికేషన్ సమర్పించాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో 2 సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ‘సెక్షన్-ఎ’లో అభ్యర్థుల సబ్జెక్టు (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ‘సెక్షన్-బి’లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ఈ ఎగ్జామ్ 2 గంటల పాటు జరుగుతుంది. ఈ జాబ్ కు ఎంపికయ్యే వారికి పే స్కేల్ రూ.65,600 నుంచి రూ.1,31,220 దాకా(Telangana Genco Jobs) ఉంటుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assistant Engineer
  • Chemist
  • jobs
  • Telangana Genco Jobs

Related News

Indian Skill Report 2026.

Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ విన

  • Alert for train passengers... Key changes for passenger trains..!

    Jobs : రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

  • Jobs

    Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • Rrb Jobs

    Jobs : RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!

Latest News

  • Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో మలుపు

  • iBOMMA Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ పై వర్మ రియాక్షన్ ఎలా ఉందంటే !!

  • Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

  • Yogitaarathore : తనకు శాండ్‌విచ్ ఇచ్చిన బెంగళూరు క్యాబ్ డ్రైవర్‌ను ప్రశంసించిన ముంబై మహిళ! 

  • Tirumala Prasadam : తిరుమల ప్రసాదంపై శివజ్యోతి అపహాస్యం.. నెటిజన్లు ఫైర్!

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd