JD Laxminarayana : బర్రెలక్క కోసం రంగంలోకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ
జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్‌లో బర్రెలక్క (శిరీష ) తరఫున ప్రచారం చేసి ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాడు
- By Sudheer Published Date - 06:10 PM, Sat - 25 November 23
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ , రేవంత్ రెడ్డి , కిషన్ రెడ్డి లకు దీటుగా బర్రెలక్క పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా బర్రెలక్క (Barrelakka ) మారింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల దంగల్ లో బరిలోకి దిగింది. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ..ఈమె వెంట పలువురు రాజకీయ నేతలు , విద్యార్థి సంఘాలు సపోర్ట్ గా నిలుస్తూ ఆమె గెలుపుకు కృషి చేస్తున్నారు.
తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana) కొల్లాపూర్‌లో బర్రెలక్క (శిరీష ) తరఫున ప్రచారం చేసి ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మన వద్ద పార్టీస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శిరీష లాంటి వారు అవసరమన్నారు. శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానే అన్నారు. ఇలాంటివాళ్లు ఎందరికో రోల్ మోడల్ అవుతారన్నారు. చాలామంది పని చేశారు… చాలా పార్టీలు పని చేశాయి.. కానీ మనం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ (Kolhapur )నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క(శిరీష) పోటీ చేస్తుంది. తన విజిల్ గుర్తుకు ఓటువేయాలంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ హైలైట్ అవుతుంది. రీసెంట్ గా ఈమె తన మేనిఫెస్టో ను విడుదల చేసింది. అవి ఏంటో చూస్తే..
1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా
2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా
3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్
7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్.
Read Also : Priyanka Gandhi : తెలంగాణ బిడ్డల భవిష్యత్తును బిఆర్ఎస్ పట్టించుకోలేదు – ప్రియాంక గాంధీ
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది