Jaggareddy Vs Laxman : లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైంది.. రిపేర్ చేయించుకో : జగ్గారెడ్డి
బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు.
- By Pasha Published Date - 06:01 PM, Tue - 14 May 24

Jaggareddy Vs Laxman : బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబ్ అయిందని, దాన్ని వెంటనే రిపేర్ చేయించుకోవాలని ఆయన విమర్శించారు. కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనేది లక్ష్మణ్ అవివేకమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘మా పార్టీ (కాంగ్రెస్)కి ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మనసు మార్చుకొని బీఆర్ఎస్ నుంచి 20 మంది, బీజేపీ నుంచి ఐదుగురు వస్తే మా ప్రభుత్వం సేఫ్ కదా. అప్పుడు మా బలం 90కి చేరదా ? దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెప్తున్నా’’ అని జగ్గారెడ్డి (Jaggareddy Vs Laxman) కామెంట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘బీజేపీ నేతలు శివలింగం మీద పాముల లాంటి వాళ్లు. అందుకే వాళ్లకు ప్రజలు మొక్కుతున్నారు. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే వాళ్లకు కూడా పడుతుంది. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని లక్ష్మణ్ అనడం ఆయన అవగాహనా రాహిత్యం’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ‘‘బీజేపీ నేత లక్ష్మణ్ ఎంపీనా.. జోత్యిష్యం చెప్తున్నాడా..? మూడు నెలల్లో ఏదో జరుగుతుందని మాట్లాడటం అవసరమా ? ఆగస్టులో కాంగ్రెస్ సంక్షోభంలో పడుతుందని అంటున్నాడు. లక్ష్మణ్.. ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఆగస్టు సంక్షోభం అనేది ఒట్టి మాట. మా ప్రభుత్వానికి పూర్తి బలం ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉండేది మేమే’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పినట్టుగానే తప్పకుండా చేస్తామన్నారు.
Also Read : Melinda Gates : బిల్‌గేట్స్ మాజీ భార్య, జెఫ్ బెజోస్ మాజీ భార్య కలిసి ఏం చేయబోతున్నారో తెలుసా ?
ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని దేశ ప్రజలకు హామీ చెప్పి.. దాన్ని అమలు చేశారా అని బీజేపీ నేత లక్ష్మణ్‌ను జగ్గారెడ్డి ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్‌తో చర్చకు రావాలని లక్ష్మణ్‌కు ఆయన సవాల్ విసిరారు. ‘‘ నువ్వు ఎంపీవే.. మా అనిల్ ఎంపీనే.. మీరు ఇచ్చిన హామీల అమలుపై, మేం ఇచ్చిన హామీలపై చర్చకు రా..!’’ అని కోరారు. తులం బంగారం రేటును రూ.28 వేల నుంచి రూ.78వేలకు బీజేపీయే పెంచిందని జగ్గారెడ్డి మండిపడ్డారు.