Jagga Reddy : ఖచ్చితంగా తెలంగాణ కు సీఎంను అవుతా – జగ్గారెడ్డి
పదేళ్లలో తాను పీసీసీ చీఫ్ అవుతానని... ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా అవుతానని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 09:33 PM, Fri - 28 June 24

సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేసారు. పదేళ్లలో తెలంగాణ కు ఖచ్చితంగా సీఎంను అవుతున్నారు. ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో పీసీసీ పదవి ఎవరికీ దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ పదవికి పలువురు పోటీ పడుతున్న నేపథ్యంలో దీనిపై జగ్గారెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ..పదేళ్లలో తాను పీసీసీ చీఫ్ అవుతానని… ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా అవుతానని పేర్కొన్నారు. పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అటెండర్ ఉద్యోగం ఇచ్చినా.. చేస్తానంటూ కామెంట్స్ చేసారు. రాబోయే పదేళ్లో ఏదో ఒకరోజు అనుకన్నట్లుగానే ఖచ్చితంగా పీసీపీ పదవి చేపడుతానని అన్నారు. అనంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా అవుతానని జగ్గారెడ్డి అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల పవర్‌కు, ప్రధాని మోదీ పవర్‌కు చాలా తేడా ఉందన్నారు. పర్మినెంట్ పొలిటికల్ పవర్ సోనియా, రాహుల్ గాంధీలదే అన్నారు. కానీ రాజకీయాల్లో మోదీది తాత్కాలిక పవరే అని బీజేపీ వారు గుర్తించాలన్నారు. ప్రధానిగా ఆయన దిగిపోయాక బీజేపీలోనే పవర్ ఉండదన్నారు. ప్రజలు మూడోసారి చాలా కష్టంగా మోదీకి అధికారం అప్పగించారన్నారు. మోదీ హామీలపై దృష్టి పెట్టకుండా.. యాభై సంవత్సరాల కిందటి ఎమర్జెన్సీ అంశాన్ని తీసుకురావడం దురదృష్టకరం. ఎప్పుడో జరిగిన ఘటనని ప్రధాని ప్రస్తావించడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ప్రధాని నరేంద్ర మోదీ తీరును RSS భగవత్ కూడా తప్పు బట్టారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే గోధ్రా ఘటన జరిగి 2000 మంది చనిపోయారు. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు బీజేపీనే లేదు ఆ తర్వాత 1980 పుట్టిన పార్టీ. బీజేపీకి గత చరిత్ర లేదు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను హింసించింది నిజం కాదా.. దీనిపై చర్చకు రాగలుగుతారా? దేశ భక్తులం అంటున్న బీజేపీ పుల్వామా ఘటనపై పార్లమెంట్ లో ఎందుకు చర్చకు పెట్టలేదు? చిన్న చిన్న ఘటనలు జరిగితే సవరించుకుని ముందుకు వెళ్లిన శక్తివంతమైన నాయకురాలు ఇందిరా గాంధీ. ఇప్పుడు సోనియా గాంధీ శక్తివంతమైన నాయకురాలు. బీజేపీ ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ వంద ఎమర్జెన్సీల గురించి మాట్లాడుతుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Read Also : T20 World Cup Final : సఫారీలతో టైటిల్ పోరు…భారత తుది జట్టులో మార్పులుంటాయా ?