Jagga Reddy : తనను ఓడించడానికి హరీశ్‌రావు రూ.60 కోట్లు ఖర్చు చేసారు – జగ్గారెడ్డి
- Author : Sudheer
Date : 04-01-2024 - 12:26 IST
Published By : Hashtagu Telugu Desk
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని .. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబరు 1 నాడే రేవంత్‌రెడ్డికి ఫోన్‌లో చెప్పినట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయనని, ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైన్‌లోనేనని, పార్టీ కోసమే పని చేస్తానని తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తాను అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మారని, అలాంటప్పుడు వారిని ఎందుకు ఓట్లడగాలి? అని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తనను ఓడించడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)రూ.60 కోట్లు ఖర్చు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తుందని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆనాడే తనకు తెలుసని .. ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అవుతానన్న విషయం కూడా తనకు తెలుసునని పేర్కొన్నారు. సంగారెడ్డికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి జరిగిందని జగ్గారెడ్డి తెలిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంతో పని చేయించానని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని తనకైతే లేదు. పార్టీ ఏం నిర్ణయిస్తే అది జరుగుతుందని అన్నారు.
Read Also : Jagan : కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్