Jagga Reddy : అభిమానికి హితబోధ చేసిన జగ్గారెడ్డి
'ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నా. నేను గెలవాలని ప్రచారం చేసిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.
- Author : Sudheer
Date : 14-04-2024 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) అంటే తెలియని వారు ఉండరు. నిత్యం ఏదొక స్టేట్మెంట్ తో వార్తల్లో నిలువడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. అలాంటి జగ్గారెడ్డి..తాజాగా తన అభిమానికి హితబోధ చేసి వార్తల్లో నిలిచారు. ‘జగ్గారెడ్డి మళ్లీ గెలిచే వరకూ చెప్పులు లేకుండా తిరుగుతాను’ అంటూ ఓ అభిమాని మొండిపట్టుపట్టగా.. ఈ విషయాన్నిజగ్గారెడ్డి దృష్టికి నేతలు తీసుకెళ్లడం తో సదరు అభిమానిని పిలిపించి సున్నితంగా మందలించారు.
We’re now on WhatsApp. Click to Join.
సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో నిర్వహించగా..ఈ కార్యక్రమానికి జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినా.. నా టైం బాగోలేక తాను ఓడిపోయానని , తాను ఓడిపోయినా మెదక్ పార్లమెంట్ లో మాత్రం కాంగ్రెస్ గెలవాలని అన్నారు. అందుకు అంతా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిని చేయడమే మన ఎజెండా అని..అందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని , అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయం డంఖా మోగించామో..లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఇదే సందర్బంగా ఓ అభిమాని తాను గెలిచే వరకు చెప్పులు వేసుకోనంటూ శబదం చేసి కూర్చోవడం తో సదరు అభిమానితో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నా. నేను గెలవాలని ప్రచారం చేసిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. నీకెందుకు అంత బాధ. చెప్పులు లేకుండా తిరిగితే ఏమైనా అయితే.. నేను ఆస్పత్రి వరకే వస్తాను. డబ్బులు ఇస్తాను. కానీ, నీ వెంట నేను రాలేను కదా. అభిమానం ఉంటే మనసులోనే ఉంచుకోవాలి. కానీ ఇలా చెయ్యొద్దు.’ అంటూ హితబోధ చేశారు.
Read Also : BRS ‘Post Card Movement’ : కాంగ్రెస్ ఫై బిఆర్ఎస్ ‘పోస్టు కార్డు ఉద్యమం’