Hyderabad: హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్‌పై ఐటీ దాడులు
చట్నీస్ కు ఐటీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని పలు చట్నీస్ హోటల్స్, మేఘనా ఫుడ్స్ వంటి ప్రముఖ ఆహార సంస్థలను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు.
- By Praveen Aluthuru Published Date - 02:48 PM, Tue - 19 March 24

Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. లోకసభ ఎన్నికలకు ముందు ఐటీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో చట్నీస్ హోటల్స్ ఎంత ఫెమాసో తెలిసిందే. అయితే చట్నీస్ కు ఐటీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని పలు చట్నీస్ హోటల్స్, మేఘనా ఫుడ్స్ వంటి ప్రముఖ ఆహార సంస్థలను లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించారు.
హోటళ్లతో పాటు వాటి యజమానుల నివాసాల్లో ఐటీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ సంస్థ యాజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా సోదాలు జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మేఘనా ఫుడ్స్ పై ఐటీ ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. బెంగళూరు మరియు హైదరాబాద్ రెండింటిలోనూ ఫ్రాంచైజీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఫుడ్ ఫ్రాంచైజీల్లో జరిగే ఆర్థిక అవకతవకలను వెలికితీయడంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.
Also Read: Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్ పూనకాలుకు సిద్ధం కండి