Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు అవమానం.. గెంటేసిన ప్రియాంక సెక్యూరిటీ
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు ప్రియాంక గాంధీ సభలో అవమానం జరిగింది
- Author : Balu J
Date : 27-11-2023 - 6:39 IST
Published By : Hashtagu Telugu Desk
Teenmaar Mallanna : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు ప్రియాంక గాంధీ సభలో అవమానం జరిగింది. ఆయన్ను ప్రియాంకా గాంధీ సెక్యూరిటీ అక్కడి నుంచి గెంటేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంకా గాంధీ ఇవాళ భువనగిరి, గద్వాల్, కొడంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రియాంకా గాంధీ తెలంగాణలోనే ఉంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ జరిగిన సభల్లో ప్రియాంకా గాంధీ.. బీఆర్ఎస్ పార్టీపై, సీఎ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అయితే.. ప్రియాంకా గాంధీ సభలో తనతో మాట్లాడేందుకు వెళ్లిన తీన్మార్ మల్లన్నకు మాత్రం తీవ్ర అవమానం జరిగింది.
సభలో ప్రియాంకా గాంధీ కూర్చున్న దగ్గరికి వెళ్లబోయిన మల్లన్నను చూసిన ప్రియాంకా గాంధీ పర్సనల్ సెక్యూరిటీ వెంటనే మల్లన్నను అక్కడి నుంచి గెంటేశారు. దీంతో ప్రియాంకను కలవకుండానే మల్లన్న అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయ్యో.. కాంగ్రెస్ లో నీకు ఇచ్చే గౌరవం ఇదేనా మల్లన్న అంటూ నెటిజన్లు ఆ వీడియో చూసి సెటైర్లు వేస్తున్నారు.
ప్రియాంక గాంధీని కలవడానికి ప్రయత్నించిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను గెంటేసిన సెక్యూరిటీ. pic.twitter.com/MEOQsqcDC0
— Telugu Scribe (@TeluguScribe) November 27, 2023