Indiramma Housing Scheme Rules : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు
Indiramma Housing Scheme Rules : లబ్ధిదారుడు తన సొంత స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం ప్రారంభించేముందు గ్రామ కార్యదర్శికి సమాచారం అందించి
- By Sudheer Published Date - 11:24 AM, Mon - 10 February 25

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరుపేదలకు సొంత గృహ కలను నిజం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme )ను పునరుద్ధరించింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద ప్రజలు తమ సొంత ఇంటిని కలిగి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 71,482 ఇండ్ల మంజూరు చేసిన ప్రభుత్వం, 21 నియోజకవర్గాల్లో 1000కు పైగా ఇండ్లు కేటాయించింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,528 ఇండ్లు మంజూరు చేయగా, మంథనిలో 1,952, బోథ్‌లో 1,538, పరకాలలో 1,501 ఇండ్లు మంజూరయ్యాయి. అలాగే, కొడంగల్‌లో 1,046, గజ్వేల్‌లో 1,001 ఇండ్లు అందించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో 1000లోపు ఇండ్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు.
National Deworming Day : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ నిబంధనలను (Indiramma Housing Scheme Rules) కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు తన సొంత స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం ప్రారంభించేముందు గ్రామ కార్యదర్శికి సమాచారం అందించి, ఫొటోలు తీయించి, జియో ట్యాగింగ్ చేయించాలి. కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో నిర్మాణం చేపట్టాలి. మొదటి విడతలో పునాది పూర్తయిన తర్వాత రూ.1 లక్ష ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది.
ప్రభుత్వం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీల్ తక్కువ ధరకు లభించేలా ఏర్పాట్లు చేసింది. ఇంటి నిర్మాణ పురోగతిని AE/MPDOలు పరిశీలించి, దశలవారీగా మంజూరు చేసే నగదును సిఫార్సు చేస్తారు. గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాలను నిర్వహించి, లబ్ధిదారులకు వివరణనిచ్చే కార్యక్రమాలు అధికారులు చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా పేదలకు తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కల నెరవేరనుంది. ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయాలు లబ్ధిదారులకు మరింత ప్రయోజనం కలిగించనున్నాయి. త్వరలోనే మిగతా గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.