Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచనలు..!
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది.
- By Kavya Krishna Published Date - 10:44 AM, Wed - 10 September 25

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నేరుగా నగదు జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనివల్ల డబ్బు మద్యవర్తులు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, లబ్ధిదారుల వివరాలను పరిశీలించినప్పుడు, దాదాపు 30% మంది ఆధార్ వివరాలు బ్యాంకు రికార్డులతో సరిపోలకపోవడం గమనించినట్లు సమాచారం.
Bellam Konda Srinivas : ఆలా చేస్తే ఇండస్ట్రీని వదిలివెళ్తా- బెల్లంకొండ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ డేటా , బ్యాంకు ఖాతా వివరాలు సరిపోలకపోతే, లబ్ధిదారుల చెల్లింపులు నిలిచిపోతాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో నిజమైన లబ్ధిదారులు కూడా సకాలంలో డబ్బులు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ వివరాలను సరిచూడడం, ఏవైనా తప్పులు ఉంటే వాటిని త్వరితగతిన సరిదిద్దడం, పేమెంట్స్ అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు పొందుతున్న వారు తమ ఆధార్‌లో పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్, వయసు లేదా ఇతర వ్యక్తిగత వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో లేదో తక్షణం తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. “సమయానికి సరిచేయకపోతే డబ్బులు జమ కావు, తద్వారా పథకం ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి” అని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం ఈ చర్యల వెనుక ఉద్దేశం పారదర్శకతను పెంపొందించడం, అవినీతి, మద్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా తగ్గించడం. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన ప్రతి ఒక్కరు సమయానికి ఆర్థిక సహాయం పొందేలా చూడడమే ప్రధాన లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు. ఇక లబ్ధిదారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే తమ ఆధార్ డేటాను తనిఖీ చేసి అవసరమైన మార్పులు చేయడం తప్పనిసరి.
AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం