Hydra Demolition : అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
Hydra Demolition : నెల రోజులుగా హైడ్రా హడావిడి లేకపోవడం తో నగరవాసులు , బిల్డర్స్ హమ్మయ్య అని అనుకున్నారో లేదో..వారం రోజుల నుండి మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి
- By Sudheer Published Date - 12:10 PM, Mon - 18 November 24

హైదరాబాద్ (Hyderabad) లో హైడ్రా (Hydraa) మళ్లీ కూల్చివేతలు (Demolition ) మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధి (Sangareddy District Aminpur Municipal Range) వందనపురి కాలనీ(Vandanapuri Colony) లో రహదారికి ఆనుకొని ఒక భవనాన్ని నిర్మించారు. దీనిపై వరుస ఫిర్యాదులు అందడంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. ఆ భవనాన్ని జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఆ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతోనే కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
నెల రోజులుగా హైడ్రా హడావిడి లేకపోవడం తో నగరవాసులు , బిల్డర్స్ హమ్మయ్య అని అనుకున్నారో లేదో..వారం రోజుల నుండి మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. ఓఆర్‌ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా గత బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చర్యలు ప్రారంభించింది. చెరువుల ఆక్రమణలంటూ కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలపై దృష్టిపెట్టింది. కొంతమందికి నోటీసులిస్తున్న హైడ్రా మరికొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు దిగుతున్నది. ఫిల్మ్‌నగర్‌లోని మహిళామండలి భవన్‌కు రోడ్డును ఆక్రమించారంటూ రెండుసార్లు నోటీసులిచ్చి ఆపై కూల్చివేసింది. నాగారంలో కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఇంటి యజమాని చెప్పడం జరిగింది.
తాజాగా ఈరోజు హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ కూల్చివేతలు చేపట్టింది. వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చినా.. ఎటువంటి స్పందనా లేకపోవటంతో అధికారులు నేడు కూల్చివేతలు చేపట్టారు. భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఈ ఏడాది జులైలో హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో 99ను తీసుకువచ్చింది. దీంతో జూలై 26 హైడ్రా కూల్చివేతలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 30కు పైగా ప్రాంతాల్లో దాదాపు 300 వరకు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగింది. జీహెచ్‌ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టడం జరిగింది.
Read Also : High School Timings : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైస్కూల్ టైమింగ్స్‌లో మార్పులు…?