Temperature Rise: చలి తగ్గింది.. ఎండ తీవ్రత పెరిగింది!
గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మంగళవారం పెరుగుతూనే ఉన్నాయి.
- By Balu J Published Date - 10:23 PM, Tue - 22 February 22

గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మంగళవారం పెరుగుతూనే ఉన్నాయి. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. ముషీరాబాద్‌లో అత్యధికంగా 35.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అంచనా ప్రకారం.. పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య కొనసాగుతుంది, అయితే కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ నుండి 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. నగరంలో రానున్న మూడు, నాలుగు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్న భారత వాతావరణ విభాగం.. హైదరాబాద్ రాత్రి ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు తగ్గవచ్చని తెలిపింది.
మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతోంది. మంగళవారం వనపర్తిలో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత నారాయణపేటలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. IMD-H సూచన ప్రకారం, సూర్యాపేట, మహబూబాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం చాలా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రత
హైదరాబాద్ లో
ముషీరాబాద్ – 35.3 డిగ్రీల సెల్సియస్
మెహదీపట్నం – 34.9 డిగ్రీల సెల్సియస్
ఖైరతాబాద్ – 34.7 డిగ్రీల సెల్సియస్
యూసుఫ్‌గూడ – 34.2 డిగ్రీల సెల్సియస్
సికింద్రాబాద్ – 33.8 డిగ్రీల సెల్సియస్
రాష్ట్రంలో
వనపర్తి – 39.2 డిగ్రీల సెల్సియస్
నారాయణపేట – 39 డిగ్రీల సెల్సియస్
జోగులాంబ గద్వాల్ – 38.1 డిగ్రీల సెల్సియస్
మహబూబ్‌నగర్ – 37.8 డిగ్రీల సెల్సియస్
నిర్మల్ – 37.5 డిగ్రీల సెల్సియస్