HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Techie And Family Found Dead Cops Suspect They Did Occult Rituals

Techie Family: టెక్కీ ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో కొత్త ట్విస్ట్.. క్షుద్ర పూజల అనుమానం!

హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వందనాపురి కాలనీలోని వారి ఇంట్లో 7 ఏళ్ల బాలికతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

  • Author : Balu J Date : 22-01-2022 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Techie
Techie

హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వందనాపురి కాలనీలోని వారి ఇంట్లో 7 ఏళ్ల బాలికతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మృతులను శ్రీకాంత్ (42), అనామిక (38), స్నిగ్ధ (7)గా గుర్తించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబంలో కొన్ని క్షుద్ర ఆచారాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు నుదిటిపై వెర్మిలియన్ గీతలున్నాయి. దేవతల ఫోటోలు నేలపై కనిపించాయి. పోలీసులకు ఇంకా సూసైడ్ నోట్, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ కేసును విచారించేందుకు ఫోరెన్సిక్ బృందాన్ని నియమించారు.

అయితే ఈ కుటుంబం రెండురోజుల క్రితం తప్పిపోయిందనే బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయడం మొదలుపెట్టారు. జనవరి 20, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు వారి నివాసానికి వెళ్లారు. ఇంటి తలుపులు తాళం వేసి ఉండడంతో, పోలీసులు వాటిని తెరిచి చూడగా వేర్వేరు గదుల్లో మృతదేహాలు కనిపించాయి. శ్రీకాంత్ హైదరాబాద్‌లో సాఫ్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, అనామిక టీచర్‌గా పనిచేసింది.

అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటం, పక్కన నేలపై దేవుళ్ల ఫొటోలు పడి ఉండటం, ఏదైనా క్షుద్ర పూజలు చేశారనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్‌పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. “మాకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు, కాబట్టి క్లూస్ కోసం మా టెక్నికల్ టీమ్ సహాయం తీసుకున్నామని చెప్పారు. నివాసంలో సీసీ కెమెరాలు ఉండడంతో వాటిలోనూ ఆధారాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు షాక్‌కు గురయ్యారు. “వారిది మంచి కుటుంబం. ప్రేమ వివాహం కావడంతో వీరికి ఎలాంటి గొడవలు లేవు. ఎవరితోనూ ఎప్పుడూ గొడవ పడలేదు’’ అని పేర్కొన్నారు. గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ ఉన్నత విద్యావంతులైన కుటుంబం క్షుద్ర పూజలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కూడా అలాంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • incident
  • police enquiry
  • techie

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd