TG Poll : ఓటర్లు లేక బోసిపోతున్న హైదరాబాద్ పోలింగ్ కేంద్రాలు
హైదరాబాద్లోని చాల పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో ఉదయం 09 గంటల వరకు హైదరాబాద్లో 5.06%, సికింద్రాబాద్లో 5.40% ఓటింగ్ మాత్రమే నమోదైంది
- By Sudheer Published Date - 11:17 AM, Mon - 13 May 24

భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని సినీ , రాజకీయ ప్రముఖులతో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ..ఓటర్లలో ఓటు పాదాన్యం తెలియజేస్తుంటే..పెద్ద ఎత్తున ఉద్యోగులు , చదువుకున్న వారు ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అన్ని సంస్థలు సెలవు ప్రకటించినప్పటికీ ఎవ్వరు కూడా తమ ఓటు హక్కును వినియోగించులేకపోతుండడం ఫై అంత విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్లోని చాల పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో ఉదయం 09 గంటల వరకు హైదరాబాద్లో 5.06%, సికింద్రాబాద్లో 5.40% ఓటింగ్ మాత్రమే నమోదైంది. సెలవు దినమని నగరవాసులు ఇంకా నిద్రలేవలేదా? అని, ఓటేసేందుకు ఇష్టపడట్లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం తమ బాధ్యతగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి సామాన్య ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిల్చొని ఓటు వేస్తుంటే..ఐటీ ఉద్యోగులు , ఇతర ఉద్యోగస్తులు ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోవడం లేదో అర్ధం కావడం లేదు.
ఇదిలా ఉంటె హైదరాబాద్ శివారు పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఓటర్లకు పార్టీల నేతలు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఓటర్ స్లిప్స్ అందించే నెపంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Also : AP Poll: సైకిల్‌కి ఓటు గుద్దేసిన జగన్ ?