Nizamia General Hospital : కోమాలో ‘చార్మినార్ దవాఖాన’
చారిత్రాత్మకమైన ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్ (చార్మినార్ దవాఖానా) ప్రభుత్వం నిర్లక్ష్యంకు సాక్షీభూతంగా ఉంది
- By CS Rao Published Date - 04:11 PM, Mon - 24 January 22

చారిత్రాత్మకమైన ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్ (చార్మినార్ దవాఖానా) ప్రభుత్వం నిర్లక్ష్యంకు సాక్షీభూతంగా ఉంది. ఎప్పుడు కూలిపోతుందో..అనే భయం అక్కడి డాక్టర్ లను, రోగులను వెంటాడుతోంది. చార్మినార్ సమీపంలోని నిజామియా టిబ్బి కళాశాల వారసత్వ నిర్మాణాన్ని పరిరక్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చెప్పడానికి కూడా అలవికానిది.ఆసుపత్రి పైకప్పు, గోడలు రాలిపోతూనే ఉన్నందున ప్రభుత్వం ఆసుపత్రికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పైకప్పుకు మరమ్మతులు తక్షణం చేయాలని ఆసుపత్రి సిబ్బంది వేడుకుంటున్నారు. చార్మినార్ దవాఖానా, టిబ్బి కళాశాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు ఈ నెల మొదట్లో చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చాడు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం సిబ్బందిని పిలిపించి తమకు ఎదురవుతున్న సమస్యలను చెప్పుకొచ్చారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోపాటు హాస్టల్ అధ్వాన్నంగా ఉందని, భవన పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు.”చరిత్రాత్మక భవనం పునరుద్ధరణ పనుల కోసం AIMIM రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. తనిఖీ సందర్భంగా, కొత్త ఆడిటోరియం నిర్మించడానికి ప్రతిపాదన కూడా ఇవ్వబడింది,” అని ఎమ్మెల్యే తెలిపారు.భవనం యొక్క స్థితి, ముఖ్యంగా నిర్మాణం యొక్క దక్షిణ భాగం కూలుతుందనే స్థితిలో ఉంది.2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కళాశాల, ఆసుపత్రి పునరుద్ధరణను ప్రారంభించారు. సుమారు రూ. 3 కోట్ల పనులు మంజూరు చేయబడ్డాయి. మొదటి దశలో ఔటర్ నిర్మాణ పనులు చేపట్టి సగం పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు. సో చారిత్రిక చార్మినార్ ఆస్పత్రి కొన ఊపిరిని కాపాడాలి.