HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Based Viyona Fintech Aims To Boost Financial Inclusion With Banking Solutions For Rural India

Viyona Fintech : హైదరాబాదీ కంపెనీ జోష్.. ‘వియోనా పే’, ‘గ్రామ్ పే’‌ విడుదల

చాలా వ్యాపార సంస్థల ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు దన్నుగా నిలిచే నమ్మకమైన సాంకేతిక భాగస్వామిగా తాము ఎదిగామని వియోనా ఫిన్‌ ‌టెక్(Viyona Fintech) వెల్లడించింది. 

  • By Pasha Published Date - 06:32 PM, Mon - 6 January 25
  • daily-hunt
Viyona Fintech Hyderabad Banking Solutions

Viyona Fintech : ఫిన్‌టెక్ రంగం విప్లవాత్మకంగా పురోగమిస్తోంది. అత్యాధునిక ఆర్థిక సేవల విప్లవంలో ఒక భాగమై ‘వియోనా ఫిన్‌టెక్’ కంపెనీ దూసుకుపోతోంది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా శరవేగంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రెండు ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్‌ను ప్రారంభించింది. వాటి పేర్లు.. వియోనా పే, గ్రామ్ పే.  దేశంలోని గ్రామీణ, సెబీ అర్బన్ ప్రాంతాల ప్రజలను ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చే దిశగా దీన్ని కీలక అడుగుగా వియోనా ఫిన్ టెక్ అభివర్ణించింది.

Also Read :CM Atishi : ఏడ్చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యల ఎఫెక్ట్

వియోనా ఫిన్ టెక్ ఏం చేస్తుంది ?

వియోనా ఫిన్ టెక్ కంపెనీ తమ యూజర్లకు డీటెయిల్డ్ పేమెంట్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ సొల్యూషన్స్ సేవలను అందిస్తుంటుంది. పే ఇన్, పే ఔట్ ప్లాట్‌ఫామ్‌లను తయారు చేసి సమకూరుస్తుంటుంది. వీటితో పాటు యూపీఐ ఇంటిగ్రేషన్, కనెక్టెడ్ బ్యాంకింగ్ ఏపీఐలను డెవలప్ చేసి అందిస్తుంటుంది. చాలా వ్యాపార సంస్థల ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు దన్నుగా నిలిచే నమ్మకమైన సాంకేతిక భాగస్వామిగా తాము ఎదిగామని వియోనా ఫిన్‌ ‌టెక్(Viyona Fintech) వెల్లడించింది.

ఏమిటీ గ్రామ్ పే ?

వియోనా ఫిన్ టెక్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్రామ్ పే’ ప్రోడక్ట్ విషయానికొస్తే..  వ్యక్తులతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని చిన్న కమ్యూనిటీలను టార్గెట్‌గా చేసుకొని దీన్ని  డెవలప్ చేశారు. అది సూక్ష్మస్థాయి బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా యూజర్లు మైక్రో ఇన్సూరెన్స్, యూపీఐ పేమెంట్స్, మైక్రో లోన్స్, యుటిలిటీ బిల్ పేమెంట్స్, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి  సేవలను పొందొచ్చు. వియోనా పే యాప్‌లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్), డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (డీఎంటీ) వంటి ఫీచర్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. తద్వారా తమ యూజర్ల ఆర్థిక లావాదేవీలను మరింత సరళతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read :Highest Railway Platforms : ‘చర్లపల్లి’‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు.. అత్యధిక ప్లాట్‌ఫామ్స్ ఉన్న రైల్వేస్టేషన్లు ఇవే

గ్రామీణ, పట్టణ ప్రాంతాలే లక్ష్యం : బి.నాగరాజ్, సీటీఓ, వియోనా ఫిన్ టెక్

‘‘ఇప్పుడు ఆర్థిక సేవల రంగం అనేది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఆధారిత డాటా ప్రాతిపదికన నడుస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వాటికి రక్షణ లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని ఇచ్చే టెక్నాలజీని డెవలప్ చేయడంపై వియోనా ఫిన్ టెక్ ఫోకస్ పెట్టింది’’ అని  వియోనా ఫిన్ టెక్ కంపెనీ సీటీఓ బి.నాగరాజ్ వెల్లడించారు. గ్రామ్ పే యాప్ ద్వారా తమ యూజర్లకు ఆర్థిక అక్షరాస్యత పెరిగిందన్నారు. తమ యాప్‌ను వాడుకొని ప్రజలు విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులను పే చేస్తున్నారని ఆయన తెలిపారు. తద్వారా ప్రజల సమయం, శక్తి ఆదా అవుతున్నాయని నాగరాజ్ చెప్పారు.

ఆర్థిక సేవల్లో ఇన్నోవేషన్‌కు పెద్దపీట :  సి.వి.కె.మధు, సీఎఫ్‌ఓ, వియోనా ఫిన్ టెక్

‘‘ఆర్థిక సేవల్లో ఇన్నోవేషన్‌కు మేం పెద్దపీట వేస్తాం. వ్యాపారాల్లో నిర్వహణ వ్యయాలను తగ్గించేలా.. క్యాష్ ఫ్లోను ఆశాజనక స్థాయిలో నిర్వహించేలా చేయడమే మా టార్గెట్. ఆర్థిక లావాదేవీలు, సేవల్లో పారదర్శకతను పెంచడంపై మా ప్రధాన ఫోకస్ ఉంటుంది. ప్రతీ భారతీయుడికి అత్యాధునిక ఆర్థిక సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో మా కంపెనీ అడుగులు వేస్తోంది’’ అని వియోనా ఫిన్ టెక్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) సి.వి.కె.మధు వివరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banking Solutions
  • GraamPay
  • hyderabad
  • Rural India
  • Viyona Fintech
  • ViyonaPay

Related News

Rangareddy

Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

Rangareddy: రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నగరానికి సమీపంగా ఉండడం వల్ల ఇది ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా మారింది. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరంరెడ్డి, షమ్షాబాద్, పటాంచెరు పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీలు స్థాపించబడ్డాయి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • 1.2 Lakh Jobs

    1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

  • Case Against Naveen Yadav

    Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్‌.. కేసు నమోదు!

  • Ktr Hydraa

    Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

Latest News

  • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

  • Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

  • Cough: ద‌గ్గుతో ఇబ్బందిప‌డుతున్నారా? అయితే ఈ క‌షాయం ట్రై చేయండి!

  • IND Beat PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియాదే విజయం!

  • Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd