KCR Strategy: ఈటలపై కేసీఆర్ స్కెచ్.. కౌశిక్ కు కీలక బాధ్యతలు!
ఆత్మీయ సమ్మెళనాల కార్యక్రమానికి తెరలేపిన కేసీఆర్ వివిధ జిల్లాల్లో పార్టీ దూసుకుపోయేలా వ్యూహరచన చేస్తున్నారు.
- Author : Balu J
Date : 19-04-2023 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికలు (Elections) సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ (CM KCR) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ (BRS) ను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పిస్తూ మరోవైపు ప్రాంతీయతపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మెళనాల కార్యక్రమానికి తెరలేపిన కేసీఆర్ వివిధ జిల్లాల్లో పార్టీ దూసుకుపోయేలా వ్యూహరచన చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు మంచి ఆదరణ వస్తుండటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ (Etala Rajendar) సస్పెన్షన్ కారణంగా బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఆయన బీఆర్ఎస్ లోపాలపై స్వారీ చేస్తూ సైలంట్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈటలకు చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవవర్గం బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్‌చార్జిగా (Incharge) కౌశిక్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఖారరు చేసినట్టు, దూకుడుగా వ్యవహరించాలంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పాడి కౌశిక్ కు కీలక బాధ్యతలు అప్పగించడంతో హుజురాబాద్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టూరిజం శాఖ బాధ్యతలు అప్పగించి..పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసినట్టు అర్ధమవుతుంది. ఇందులో భాగంగా హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంఛార్జిగా పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)ని నియమిస్తున్నట్టు ఆ పార్టీ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది. హుజురాబాద్ లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ వంటి బలమైన నేత ఉన్న కారణంగా అతనికి సరైన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని భావించిన పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అనే ఫార్ములాను బీఆర్ఎస్ పాటించినట్లు తెలుస్తుంది. అయితే హుజురాబాద్ లో ఈటలకు మంచి పేరు ఉండటం.. గత ఎన్నికల్లో వరుసగా ఆయన గెలుస్తుండటం ఇతర పార్టీలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈటలను ఓడించడం అంత ఈజీ కాదని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి.
Also Read: Indian Students: భారత విద్యార్థులపై ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు నిబంధనలు