HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Husband Killed His Wife At Participated In The Siddipet Bathukamma Celebrations

Crime News : సిద్దిపేటలో దారుణం.. బ‌తుక‌మ్మ ఆడుతున్న భార్యను హ‌త్య చేసి..!

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హ‌త్య‌ల సంఖ్య పెరిగిపోతుంది. క్ష‌ణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియ‌క నిండు ప్రాణాల‌ను బ‌లి చేస్తున్నారు.

  • By Hashtag U Published Date - 12:27 PM, Mon - 26 September 22
  • daily-hunt
Siddipet Murder
Siddipet Murder

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హ‌త్య‌ల సంఖ్య పెరిగిపోతుంది. క్ష‌ణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియ‌క నిండు ప్రాణాల‌ను బ‌లి చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అక్ర‌మ సంబంధాలు వ‌ల‌న హ‌త్య‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో దారుణం జ‌రిగింది. వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తుందంటూ బ‌తుక‌మ్మ ఆడుతున్న భార్య‌ను భ‌ర్త దారుణంగా హ‌త్య చేసి ప‌రార‌య్యాడు. సిద్దిపేట జిల్లా వీరాపూర్‌లో ఈ దారుణ హ‌త్య చోటుచేసుకుంది.

స్థానికులు, కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వీరాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి-ఎల్ల‌మ దంపతుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కూతురుని అదే గ్రామానికి చెందిన ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వివిధ కార‌ణాల‌తో పెళ్లి అయిన నెల రోజుల‌కే మంగ కిరోసిన్ పోసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ క్ర‌మంలో రెండో కుమార్తె స్వ‌ప్న‌ను ఎల్లారెడ్డికే ఇచ్చి రెండో పెళ్లి చేశారు. ఎల్లారెడ్డి- స్వ‌ప్న దంప‌తుల‌కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. 6 సంవ‌త్సరాల పాటు స‌జావుగా సాగిన వీరి కాపురం ఉన్న‌ట్టు ఉండి గొడ‌వ‌లు, మ‌న‌స్ప‌ర్థ‌లు చోటుచేసుకున్నాయి. అయితే స్వ‌ప్న పెళ్లి కాక‌ముందు నుంచే వీరాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తితో 14 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తోంది. విష‌యం తెలిసిన ఎల్లారెడ్డి భార్య స్వ‌ప్న‌ను ప‌లుమార్లు మంద‌లించాడు. తాజాగా ఇదే విష‌య‌మై ఆమెతో గొడ‌వ‌ప‌డి చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ క్ర‌మంలో ఆదివారం రాత్రి స్వ‌ప్న తోటి మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ ఆడుతుండ‌గా ఎల్లారెడ్డి అక్క‌డికి చేరుకొని భార్య‌ను దారుణంగా హ‌త్య చేశాడు. త‌న‌తో తెచ్చుకున్న ఇనుప రాడ్‌ను బతుక‌మ్మ ఆడుతున్న భార్య త‌ల‌పై బ‌లంగా కొట్టడంతో స్వ‌ప్న అక్క‌డికక్క‌డే మృతిచెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స్వ‌ప్న త‌ల్లి ఎల్ల‌మ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నాఉ. నిందితుడు ఎల్లారెడ్డి ప‌రారీలో ఉన్న‌ట్లు ఎస్సై తిరుప‌తి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bathukamma Celebrations
  • Brutally Murdered
  • husband and wife
  • siddipet

Related News

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd