Fog On Highway : నల్లగొండ హైవేను కప్పేసిన మంచు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. మంచు వర్షంలా కురుస్తున్నది. శీతల గాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
- By Hashtag U Published Date - 10:41 AM, Wed - 2 February 22
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. మంచు వర్షంలా కురుస్తున్నది. శీతల గాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం 10 గంటలైన మంచు దుప్పటి విడిపోవడం లేదు. హైదరాబాద్ to విజయవాడ జాతీయ రహదారిపై.., అద్దంకి to నార్కెట్ పల్లి రహదారులపై పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో.. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దింతో.. వాహనదారులు వాహనాల హెడ్ లైట్స్ వేసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. పట్టణాలు ,పల్లెల్లు అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచు తెరలు దట్టంగా అలుముకున్నాయి. ఉదయాన్నే వ్యాయామం చేసే వాళ్లు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్, మున్సిపల్ కార్మికులు చలికి గజ గజ వణుకుతున్నారు. మంచుతో పాటు వేగంగా విస్తున్న అతి శీతల గాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి..