High Tension At Chikkadpally : విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్
చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు , నిరుద్యోగులు చేరి గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ ర్యాలీ నిర్వహించారు
- Author : Sudheer
Date : 15-07-2024 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నగరం (Hyderabad) మరోసారి ధర్నాలు , ఆందోళనలతో వణికిపోతుంది. గత కొద్దీ రోజులుగా DSC విద్యార్థులు కాంగ్రెస్ సర్కార్ (Congress) ఫై వ్యతిరేకత చూపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు ఆందోళన (Unemployed youth stage protest) చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రకటించినట్లే జులై 18 నుండి DSC ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అయినప్పటికీ విద్యార్థులు , నిరుద్యోగులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి (Chalo Secretariat) పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ తరుణంలో పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇక సాయంత్రం కూడా నిరుద్యోగులు తమ ఆందోళనలు కొనసాగించారు. చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు , నిరుద్యోగులు చేరి గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడం తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో అభ్యర్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. ప్రస్తుతం ఎప్పుడు ఏంజరుగుతుందో అని అంత ఖంగారుపడుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్. pic.twitter.com/eCmEAgvr0O
— Balka Suman (@balkasumantrs) July 15, 2024
Read Also : BRS : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి చేదు అనుభవం