Rains in Telangana : తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలే..
నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురవనున్నాయి.
- Author : News Desk
Date : 18-08-2023 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా వర్షాలు(Rains) కురిసి మళ్ళీ ఇప్పటివరకు వర్షాలు పడలేదు. వర్షాకాలం ఆరంభంలో ఒకేసారి తెలంగాణ(Telangana)ని వర్షాలు ముంచెత్తాయి. ఈ మధ్య అక్కడక్కడా సన్నని చినుకులు తప్ప వర్షం పడలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలుకానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ విశ్లేషణ ప్రకారం నిన్న వాయువ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 నుండి 3 రోజుల్లో ఉత్తర ఒరిస్సా , ఉత్తర చత్తీస్గడ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది.అలాగే దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ – వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
దీంతో నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురవనున్నాయి. ఎల్లుండి కూడా కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు రాత్రి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. వర్షాలు వస్స్తున్నాయని ప్రకటించడంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read : Congress to BRS : బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి? కాంగ్రెస్ కు జలక్!