Rain Alert : ఈనెల 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు.. ఎక్కడంటే ?
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
- Author : Pasha
Date : 18-09-2023 - 7:32 IST
Published By : Hashtagu Telugu Desk
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు అక్టోబర్ మొదటి వారం వరకు కొనసాగొచ్చని అంటున్నారు. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 6 నుంచి 12 మధ్య తెలంగాణ నుంచి వెనుదిరిగే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో క్రమంగా టెంపరేచర్స్ పెరగొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 33 జిల్లాల్లో 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు.
Also read : Vinayaka Chavithi : వినాయక చవితి వేళ.. వర్జ్యం, దుర్ముహూర్తం టైమింగ్స్ ఇవే
వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 19వ తేదీ నాటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయంటున్నారు.