Fancy Number : ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లో 9999 అనే నంబర్ కు ఎన్ని లక్షలు పెట్టారో తెలుసా..?
కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా వారికీ కలిసొచ్చే నెం కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. అంకెలను బాగా నమ్మే మనదేశంలో లక్కీ నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తారు
- By Sudheer Published Date - 12:08 PM, Wed - 6 September 23

చాలామందికి చాల సెంటిమెంట్స్ ఉంటాయి. కొందరికి కొన్ని విషయాల్లో కొన్ని సెంటిమెంట్స్ ఉంటె..మరికొందరికి ఫ్యాన్సీ నంబర్ల (Heavy Competition For Fancy Number) సెంటిమెంట్స్ ఉంటాయి. ఈ నెం ఉంటె అదృష్టం కలిసి వస్తుందని గట్టిగా నమ్ముతారు. ఆలా అన్నింట్లో ఆ నెం (Fancy Number) ఉండేలా చూసుకుంటారు. ఆ నెం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా వారికీ కలిసొచ్చే నెం కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. అంకెలను బాగా నమ్మే మనదేశంలో లక్కీ నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తారు. తమకు నచ్చిన నెంబర్ కోసం ఆర్టీఓ (RDO) కార్యాలయాల్లో ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుంటారు.
ఫ్యాన్సీ నెంబర్లు, సింగిల్, డబుల్ డిజిట్ నెంబర్ల కోసం దేశవ్యాప్తంగా వెలం కూడా నిర్వహిస్తోంది ఆర్టీఓ (fancy number bidding ). ఇలాంటి వేలాల్లో ఆర్టీఓకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. తాజాగా హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధి (Hyderabad East Zone Bidding)లో మంగళవారం (సెప్టెంబర్ 5) జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లో ఫ్యాన్సీ నంబర్లు భారీ ధర పలికి, ఆర్టీఏ కు కాసుల పంట కురిపించింది.
Read Also : CM KCR: రేపు కామారెడ్డి నేతలతో కేసీఆర్ భేటీ, గెలుపు వ్యూహాలపై చర్చ
నిన్న ఒక్క రోజే ఫ్యాన్సీ నంబర్లతో రూ.18 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 11 ఈజెడ్ 9999 (TS11 EZ 9999) అనే నంబర్ కు రూ.9,99,999లు పలికింది. ఈ ఫ్యాన్సీ నంబర్ ను చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకుంది. అలాగే టీఎస్11 ఎఫ్ఏ 0001 నంబర్ ను రూ.3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకున్నారని రవాణా శాఖ తెలిపింది. అదే సిరీస్ తో 0011 నంబర్ ను శ్యామల రోహిత్ రెడ్డి రూ. 1.50 లక్షలకు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల ఆగస్టులో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లోను అలాగే కాసుల పంట కురిసింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ.53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్ కు రూ.21.60 లక్షలు పలకగా.. అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్ కు రూ.1.04 లక్షలు పలికింది.