Eggs Rubbery : విద్యార్థులకు ఇవ్వాల్సిన గుడ్లు దొంగతనం చేసిన స్కూల్ హెడ్ మాస్టర్
ప్రతి రోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన గుడ్లలో కొన్ని గుడ్లను తన బ్యాగ్ లో వేసుకొని ఇంటికి వెళ్తూ వస్తుంది
- By Sudheer Published Date - 02:19 PM, Sun - 28 July 24

తెలంగాణ సర్కార్ (Telangana Govt) ప్రభుత్వ స్కూల్స్ (Government School) లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal Scheme) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారంలో ఒక రోజు గుడ్డు కూడా పెడుతుంటారు. అయితే ఆలా విద్యార్థులకు ఇవ్వాల్సిన గుడ్ల ఫై కన్నేసింది స్కూల్ హెడ్ మాస్టర్..ప్రతి రోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన గుడ్లలో కొన్ని గుడ్లను తన బ్యాగ్ లో వేసుకొని ఇంటికి వెళ్తూ వస్తుంది. అయితే కొంతమంది విద్యార్థులకు గుడ్లు పెట్టి ..మరికొంతమందికి పెట్టకపోవడం తో ఆ పిల్లలు తల్లిదండ్రులకు తెలిపారు. ఏదో ఒక సారి ఆలా జరిగి ఉంటుందిలే అని వారు కూడా లైట్ తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ప్రతి సారి ఇదే జరగడం తో అసలు ఏంజరుగుతుందా అని తెలుసుకునే ప్రయత్నం చేసారు. అయితే ఈ గుడ్లను హెడ్ మాస్టరే తీసుకెళ్తుందని గ్రహించి..డైరెక్ట్ గా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ గా ఆమె బ్యాగ్ లో వేసుకోవడాన్ని ఫోన్ కెమెరా తో షూట్ చేసి..డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి డీఈవో దిగి విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మం. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో జరిగింది. స్కూల్లో 55 మంది పిల్లలకు 55 గుడ్లు పంపగా 49 మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హెడ్ మాస్టర్ జోష్ణ దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని డీఈవోకు ఫిర్యాదు చేశారు.
Read Also : Madanapalle Files Burnt Case : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు