Madanapalle Files Burnt Case : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తాజాగా నోటీసులు జారీ చేశారు
- Author : Sudheer
Date : 28-07-2024 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు (Madanapalle Sub Collector Office)లో జరిగిన అగ్ని ప్రమాదం (Fire Incident) కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజంగా ఇది ప్రమాదమా..? లేక కావాలని చేసిన కుట్రపూరితమా..? విచారణ చేయాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించడం తో ఘటన కు సంబంధించి లోతుగా దర్యాప్తు చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇది సడెన్ గా జరిగిన అగ్ని ప్రమాదం కాదని కావాలని చేసిన ప్రమాదమని పోలీసులు తేల్చారు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇవ్వడం..విచారణ జరపడం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాషా ఇంట్లో నోటీసులు అందజేసి, ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్ని, పలువురు వైసీపీ లీడర్లను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటె ఈ ఘటన తో మాకు ఎలాంటి సంబంధం లేదని పెద్దిరెడ్డి తో పాటు మిదున్ రెడ్డి తెలిపారు. కావాలనే కొంతమంది తమను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని..ఈ ఘటన తో మాకు సంబంధం ఉందని తేలితే రాజకీయాల్లో నుండి తప్పుకుంటానని మిదున్ రెడ్డి ప్రకటించారు. ఇక మాజీ సీఎం జగన్ సైతం ఈ ఘటన ఫై సీరియస్ అయ్యారు. చంద్రబాబు కావాలనే పెద్దిరెడ్డి ని టార్గెట్ చేస్తున్నారని..కాలేజ్ లో తనపై చేయి చేయి చేసుకున్నాడని పెద్దిరెడ్డి ఫై బాబు పగ పెంచుకున్నాడని జగన్ ఆరోపించారు.
Read Also : Paris Olympics 2024: ఒలింపిక్స్ లో డోపింగ్ కేసు, నైజీరియా బాక్సర్ సస్పెండ్