Harish Rao: బీఆర్ఎస్ మేనిఫెస్టో తో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం: మంత్రి హరీశ్ రావు
కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లు మంత్రి హరీష్ రావు పరిశీలించారు.
- By Balu J Published Date - 03:19 PM, Tue - 10 October 23

Harish Rao: ఎన్నికల శంఖారావం మోగిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15న హుస్నాబాద్ లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లు మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు తో కలిసి సభా ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకం. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారు. అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష నియోజకవర్గం. మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నారు’’ మంత్రి హరీశ్ రావు అన్నారు.
‘‘ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కనీసం టికెట్లు ఇచ్చుకొనే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ వయా బెంగళూరు. మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాకు పెట్టింది పేరైన కాంగ్రెస్ మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘15వ తేదీ మేనిఫెస్టో విడుదల తర్వాత నిర్వహించే మొదటి సభ హుస్నాబాద్ లో జరుగుతుంది. కెసిఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయం. 2014, 18లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఏవయితే చెప్తారో దానిని పక్క చేసి చూపిస్తారు. మూడు గంటలు కరెంటు రైతులకు సరిపోతుంది అన్న కాంగ్రెస్ కావాలా రైతుల మోటర్లకు మీటర్లు పెడుతున్న బిజెపి కావాల్నా, మూడు పంటలకు సరిపడా కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా’’ మంత్రి హరీశ్ రావు అన్నారు.