HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gurukul Schools Over Unpaid Rent

Gurukul Schools : పేద విద్యార్థులను కూడా వదలని బిఆర్ఎస్ నేతలు ..?

Gurukul Schools : అధికారం చేతిలో ఉండేసరికి వారు ఏంచేసినా చెల్లింది. చిన్న , పెద్ద ఇలా అన్ని తమకే దక్కేలా సాగించారు

  • Author : Sudheer Date : 25-10-2024 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lock Gurukul Schools Over U
Lock Gurukul Schools Over U

గత పదేళ్ల బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు తమ ఆస్తులను విపరీతంగా పెంచుకున్నారనే ఆరోపణలు మొదటి నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారం చేతిలో ఉండేసరికి వారు ఏంచేసినా చెల్లింది. చిన్న , పెద్ద ఇలా అన్ని తమకే దక్కేలా సాగించారు. చిన్న కాంట్రక్ట్ దగ్గరి బడా కాంట్రక్ట్ల వరకు అన్ని వారికే దక్కాయి. ఇదే క్రమంలో పేద విద్యార్థులను కూడా వదిలిపెట్టలేదని తెలుస్తుంది.

ప్రధానంగా, పేద విద్యార్థులు చదివే గురుకులాలను ఈ పార్టీ నేతలు వదలకుండా, తమకు సంబంధించిన సొంత భవనాలను అద్దెకు ఇచ్చినట్లు, మార్కెట్ రేట్లను అమలు చేయకుండా ఎక్కువ అద్దె రేట్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,023 గురుకులాలలో 80% గురుకులాలు గులాబీ నేతలకు సంబంధించిన భవనాల్లోనే నడుస్తున్నాయని, మిగతా భవనాలను అద్దెకు తీసుకోవడంలో రాజకీయ ప్రోద్బలం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులను బెదిరించటం లేదా బుజ్జగించడం ద్వారా ఇష్టారీతిన అద్దె రేట్లు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.

గురుకులాలకు అవసరమైన సౌకర్యాలు లేనప్పటికీ, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ భవనాలను అద్దెకు తీసుకున్నారని సమాచారం. కొందరు బిల్డింగ్ యజమానులు, అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో, పాఠశాలలకు తాళాలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రాజకీయ ప్రోద్బలం కలిగిన చర్యగా భావిస్తున్నారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన స్థలాల్లో కాకుండా, నేతలకు చెందిన సొంత భవనాల్లో గురుకులాలను నడిపించడం జరిగినట్లు తెలిసింది.

దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు అక్టోబర్ 15న తిరిగి గురుకులాలకు వెళ్ళగా, కొన్ని చోట్ల పాఠశాలలకు తాళాలు వేసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బిల్డింగ్ యజమానులు తమ పెండింగ్ అద్దె చెల్లింపు లేనందునే తాళాలు వేశారని, అద్దె చెల్లించిన తర్వాతే పాఠశాలలు తెరుస్తామని డిమాండ్ చేశారు. అయితే, ఈ పరిణామం వెనుక విపక్ష లీడర్ల ప్రోత్సాహం ఉందని ప్రచారం జరిగింది. సాధారణంగా బిల్డింగ్ యజమానులు ప్రభుత్వంతో వివాదాలు పెట్టుకోరు, కానీ వారికి రాజకీయ నేతల నుండి భరోసా ఇవ్వబడినట్లు తెలుస్తోంది. ‘మీ వెనుక మేమున్నాం’ అంటూ గులాబీ (బీఆర్ఎస్) నేతలు భరోసా ఇచ్చారని, ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో జరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక గురుకులం మాజీ మంత్రికి చెందిన బంధువుల సొంత భవనంలో నడుస్తోంది. ఈ భవనం గతంలో కోళ్ల ఫామ్‌గా ఉపయోగించబడేదిగా, తరువాత ఇంజినీరింగ్ కాలేజీకి మార్చి, ఆ కాలేజీ మూతపడిన తర్వాత, గురుకులం కోసం అద్దెకిచ్చారని సమాచారం.

Read Also : Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS Leaders
  • Gurukul Schools Over Unpaid Rent

Related News

Brs

Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గులాబీ పార్టీ, ఈసారి ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

Latest News

  • ‘Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

  • చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

  • కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

  • హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు

  • Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd