Gunti Nagaraju : గుంటి నాగరాజుకు బెదిరింపులు.. లబోదిబోమంటూ కన్నీరు
కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నాగరాజుకు ఫోన్ చేసి ప్రచారం ఆపాలంటూ బెదిరిస్తున్నారట
- By Sudheer Published Date - 10:30 PM, Tue - 21 November 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ (Independent Candidate) గా బరిలోకి దిగిన అభ్యర్థులకు బెదిరింపులు , దాడులు ఎక్కువుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నికల బరి నుండి తప్పుకోవాలని , ప్రచారం ఆపాలంటూ దాడులు చేయడం , ఫోన్లు చేసి బెదిరించడం వంటివి చేస్తున్నారు. మంగళవారం కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క (Barrelakka ) (శిరీష ) బ్రదర్స్ పై దాడులకు పాల్పడిన ఘటన వైరల్ గా మారగా..తాజాగా ఖమ్మం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన యూట్యూబర్ గుంటి నాగరాజు (Gunti Nagaraju) కు సైతం బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తెలంగాణ ఎన్నికల బరిలో రాజకీయ నేతలతో పాటు సోషల్ మీడియా (Social Media) ద్వారా పాపులర్ అయినా వారు సైతం బరిలోకి దిగారు. అలాంటి వారిలో నాగరాజు ఒకరు. సోషల్ మీడియాలో రీల్స్, డాన్స్ వీడియోస్, వ్లాగ్స్ చేస్తూ పాపులర్ అయిన నాగరాజు ఖమ్మం (Khammam) నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే నామినేషన్ వేశారు. విజిల్ గుర్తుకు ఓటు వేయండి అంటూ గత కొద్దీ రోజులుగా బైక్ ఫై వినూత్నంగా ప్రచారం చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. గుంటి నాగరాజు ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. తన ప్రచారానికి సంబంధించిన ప్రతీ వీడియోలను యు ట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తూ వినూత్నంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. అలాగే పలువురు యూట్యూబర్స్ సైతం నాగరాజుకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నాగరాజుకు ఫోన్ చేసి ప్రచారం ఆపాలంటూ బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో చెపుతూ వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో గుంటి నాగరాజు.. ‘నేను నామినేషన్ వేయడం తప్పా? ఒక రైతు బిడ్డగా సామాన్యులకు సహాయం చేయాలని నామినేషన్ వేశాను. అర్థరాత్రి ఫేక్ కాల్స్ చేసి నామినేషన్ వెనక్కు తీసుకోమని బెదిరిస్తున్నారు. ఒక రైతు బిడ్డ గెలవాలని.. నేను ఎన్నికల్లో నిలబడ్డాను ఫ్రెండ్స్.. దయచేసి విజిల్ గుర్తుకు ఓటు వేయండి.. ఎవ్వరూ ఎంత ఫోర్స్ చేసినా.. బెదిరించినా.. తిట్టినా నేను మాత్రం ఎన్నికల నుంచి తప్పుకోను.. కాల్స్ చేస్తున్న వాళ్లు ఇతర పార్టీల వాళ్లా? ఫేక్ కాల్సా? అనేది తెలియడం లేదు..’ అంటూ ఏడుస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.
Read Also : Telangana: అందుకే కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పోయిండు