HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Group 2 Student Marri Pravalika Suicide In Hyderabads Ashok Nagar

Group 2 Student Suicide : ‘గ్రూప్ 2’ అభ్యర్థిని ఆత్మహత్య ? సూసైడ్ లెటర్ వైరల్

Group 2 Student Suicide : హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్‌ 2 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న మర్రి ప్రవళిక అనే యువతి సూసైడ్ చేసుకుంది.

  • Author : Pasha Date : 14-10-2023 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
92% Marks Suicide
92% Marks Suicide

Group 2 Student Suicide : హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్‌ 2 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న మర్రి ప్రవళిక అనే యువతి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ఆమె ఆత్మహత్యతో కలకలం రేగింది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడిందని అంటున్నారు.  గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతో మనస్థాపానికి గురై ఆమె సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తూ పలువురు గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్, బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈ హైడ్రామా కొనసాగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక శనివారం ఉదయాన్నే ప్రవళిక తల్లి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వచ్చి.. కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ప్రభుత్వ ఉద్యోగంతో ఇంటికి వస్తుందని అనుకుంటే ఇలా అయిందంటూ ప్రవళిక తల్లి కన్నీరు మున్నీరయ్యారు.  ప్రవళిక రాసిందని ప్రచారం జరుగుతున్న ఓ సూసైడ్ నోట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘అమ్మా నన్ను క్షమించండీ’’ అంటూ మొదలు పెట్టిన ఆ లేఖలో పలు అంశాలను ప్రవళిక ప్రస్తావించింది. ‘‘నేను నష్టజాతకురాలిని. నా వల్ల పేరెంట్స్‌కు ఎప్పుడూ బాధలే. మీకు నేను చాలా అన్యాయం చేశాను. నా కాలు కిందపెట్టకుండా చూసుకున్న అమ్మకు ధన్యవాదాలు. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నందుకు (Group 2 Student Suicide) క్షమించాలి’’ అని  లేఖను ప్రవళిక ముగించింది.

Also Read: Narendra Modi Stadium: నేడే పాక్- భారత్ మ్యాచ్.. లక్ష మంది ప్రేక్షకులు, 11 వేల మంది సెక్యూరిటీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashok Nagar
  • Bikkajipalli
  • Group 2 Student Suicide
  • hyderabad
  • Marri Pravalika Suicide
  • Warangal District

Related News

Aprilia Rs457

హైదరాబాద్‌లో అప్రిలియా RS457 ట్రాక్ డే

ఈ ట్రాక్ డే కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అప్రిలియా యొక్క సరికొత్త శ్రేణి వాహనాల ప్రదర్శనకు వేదికైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు, కాబోయే రైడర్లను ఒకచోట చేర్చి అప్రిలియా RS457 మరియు టువోనో 457 వంటి మోడళ్లను క్లోజ్-అప్‌గా వీక్షించే అవకాశం కల్పించారు.

  • Fire Breaks Out At Hyderaba

    నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన పై అనుమానాలు ?

  • Nampally, Fire Accident

    నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం

  • vande bharat trains bomb threat

    వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

  • Avpn Health Impact Leadersh

    హైదరాబాద్‌లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం

Latest News

  • వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

  • మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి

  • ‘మధిర అంటే నాకు ప్రాణం’ – భట్టి విక్రమార్క

  • క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

  • భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైక్ ధరలు!

Trending News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd