HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Green India Challenge To Take Forward The Significance Of Jammi In Our Puranas For Future Generations Mp Santosh

MP Santosh: మన పురాణాల్లో ఉన్న జమ్మి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రీన్ ఛాలెంజ్; ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది.

  • By Hashtag U Updated On - 02:40 PM, Wed - 14 September 22
MP Santosh: మన పురాణాల్లో ఉన్న జమ్మి విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించేలా గ్రీన్ ఛాలెంజ్; ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం రెండో యేడాదిలోకి అడుగుపెట్టింది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి లతో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో జమ్మి మొక్కలు నాటి రెండో విడతను లాంఛనంగా ప్రారంభించారు.

దసరా పండగ సందర్భంగా అన్ని గ్రామాలు, గుడుల్లో కలిపి లక్షా ఇరవై వేల జమ్మి మొక్కలను నాటేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో కలిసి అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం గుర్తించింది. అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని తీసుకున్నామని సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అటవీ, దేవాదాయ శాఖలకు ఎంపీ కృతజ్జతలు తెలిపారు.

తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం ఎంపీ సంతోష్ కుమార్ తీసుకోవటాన్ని ఆహ్వానిస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుడుల్లో జమ్మి చెట్టు నాటి, పెంచేలా దేవాదాయ శాఖ ద్వారా చొరవ తీసుకుంటున్నామని వెల్లడించారు.

యువ ఎంపీగా ఉన్న సంతోష్ కుమార్ పర్యావరణంతో పాటు సంస్కృతికి ప్రాధాన్యతను ఇవ్వటం సంతోషకరం అన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఫారెస్ట్ కార్పోరేషన్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి కార్యక్రమాన్ని విసృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వేదకాలం నుంచీ నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.

ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ ఫోటోలను జమ్మి అని టైప్ చేసి 9000365000 నెంబర్ కు వాట్స్ అప్ చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు తెలిపారు

బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్

ఐటీ కారిడార్ తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఆక్సీజన్ హబ్ గా, రోజు వారీ వాకింగ్ తో పాటు వారాంతాల్లో కుటుంబాలకు సేదతీరే ప్రాంతంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 270 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం, అటవీశాఖ చొరవతో ప్రకృతివనంగా మారింది. ఇవాళ సమావేశం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ తమ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్భుతంగా తీర్చిదిద్దిన బొటానికల్ గార్డెన్స్ విశిష్టతను కాపాడేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ హామీఇచ్చారు.

Tags  

  • green challenge
  • Jammi tree
  • MP Joginapally Santosh Kumar
  • Palapitta

Related News

Green Challenge : హ‌రిత‌హారం భాగోతంపై ఢిల్లీ ఈడీ ! సంతోష్ రావు పై ఫిర్యాదు!

Green Challenge : హ‌రిత‌హారం భాగోతంపై ఢిల్లీ ఈడీ ! సంతోష్ రావు పై ఫిర్యాదు!

తెలంగాణ ప్ర‌భుత్వంపై పోరాడే కాంగ్రెస్ లీడ‌ర్ జ‌డ్స‌న్ మ‌రో కుంభ‌కోణాన్ని(Green Challenge) 

  • Santosh Kumar: హరిత తెలంగాణ, హరిత భారత్.. ‘గ్రీన్ ఛాలెంజ్’ లక్ష్యం ఇదే!

    Santosh Kumar: హరిత తెలంగాణ, హరిత భారత్.. ‘గ్రీన్ ఛాలెంజ్’ లక్ష్యం ఇదే!

  • CM KCR : `పాల పిట్ట‌` పంజ‌రంలో కేసీఆర్‌

    CM KCR : `పాల పిట్ట‌` పంజ‌రంలో కేసీఆర్‌

  • Shami Tree : దసరా రోజు జమ్మీ చెట్టుకు పూజలు చేస్తే…మీ జీవితాన్నే మార్చేస్తుంది..!!

    Shami Tree : దసరా రోజు జమ్మీ చెట్టుకు పూజలు చేస్తే…మీ జీవితాన్నే మార్చేస్తుంది..!!

Latest News

  • Dreams: కలలో ఈ 6 సంఘటనలను చూడటం చాలా శుభదాయకం

  • 1 Killed : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

  • TDP : టీడీపీలో చేరిన శ్రీకాళ‌హ‌స్తి మాజీ ఎమ్మెల్యే ముని రామ‌య్య‌

  • Khammam : ఖమ్మంలో ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి పాల్ప‌డ్డ దేవాదాయ‌శాఖ‌ ఇన్‌స్పెక్టర్.. అధికార పార్టీ నేత వేధింపులే..?

  • Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి రివాల్వర్ తో కాల్చుకోవాలనుకున్నా: పవన్ కళ్యాణ్

Trending

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

    • Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

    • Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: