HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Great Results For Singareni Workers In Telangana Mlc Kavitha

MLC Kavitha: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప ఫలితాలు: ఎమ్మెల్సీ కవిత

సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు

  • Author : Balu J Date : 05-06-2023 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు, చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేక వ్యక్తులు, శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సీఎం కేసీఆర్ గారు కార్మికుల మంచికోరే వ్యక్తిగా కారుణ్య నియామ ప్రక్రియ ద్వారా ప్రతినెలా ఉద్యోగులను తీసుకుంటున్నారన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటిదాక దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా, కూతుర్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల కేసీఆర్ కు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలను , తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.25 లక్షలకు పెంచామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 సంవత్సరాలకు పెంచుకోవడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. కార్మికులకు సౌకర్యవంతంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్ తో పాటు, ఏసీ ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు కల్పించడం, ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం, మహిళా కార్మికులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి ఏరియా ఆస్పత్రులలో తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం, ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు అందించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్ మెంట్ ఇవ్వడం, సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజుతో పాటు, మరో రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించి సీఎం కేసీఆర్ గారు అంబేద్కర్ పట్ల ఉన్న గొప్ప ప్రేమను మరోసారి చాటుకున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అమ్మ లాంటి సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ గారు కాపాడి, విస్తరించి, ఇతర రాష్ట్రాలకు సైతం సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లను అధనంగా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, సంస్థను లాభాల బాట పట్టించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే, తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే సాధ్యమయ్యాయని గర్వంగా చెబుతున్నానన్నారు ఎమ్మెల్సీ కవిత.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • cm kcr
  • MLC Kavitha
  • singareni

Related News

Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd