HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Women Gold Prices Have Dropped Significantly

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

Gold Price Today: అమెరికాలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్‌డౌన్‌కు ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలకడంతో, దేశ ఆర్థిక గణాంకాల విడుదల వాయిదా పడింది

  • Author : Sudheer Date : 15-11-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Digital Gold
Digital Gold

అమెరికాలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్‌డౌన్‌కు ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలకడంతో, దేశ ఆర్థిక గణాంకాల విడుదల వాయిదా పడింది. ఈ అనిశ్చితి వాతావరణంతో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల్లో మరింత సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు డిసెంబరులో 25 బేసిస్ పాయింట్ల రేట్ల తగ్గింపు ఖాయం అన్న అంచనాలు ఉండగా, తాజా పరిణామాలతో అది వాయిదా పడే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఫెడ్ అధికారులు హాకిష్ వ్యాఖ్యలు చేయడం కూడా రేట్ల కోత త్వరలో ఉండదనే అభిప్రాయాన్ని బలపరిచింది. ఈ ఒక్క పరిణామం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను గట్టిగా కుదించింది.

Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!

ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు దేశీయంగా మరియు గ్లోబల్‌గా భారీ ఎత్తున పెరిగాయి. పెట్టుబడిదారులు ఈ అంచనాలకనుగుణంగా పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడులు పెట్టగా, ఇప్పుడు ఫెడ్‌ రేట్ల కోత వాయిదాపడే సూచనలతో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. ఫలితంగా ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1450 తగ్గి రూ.1,16,450కి చేరగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు రూ.1580 పతనంతో రూ.1,27,040 వద్దకు చేరింది. వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పు లేకుండా స్వల్పంగా పెరిగి కిలోకు రూ.1,83,100గా ట్రేడయ్యాయి.

అంతర్జాతీయంగా స్పాట్‌ గోల్డ్‌ రేటు మరింత ప్రభావితమైంది. ఒక దశలో ఔన్సుకు 4200 డాలర్లపై ట్రేడవుతున్న బంగారం, ఇంట్రాడేలో 150 డాలర్లకు పైగా పడిపోయి చివరకు 4085 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండిరేటు కూడా 53 డాలర్ల స్థాయి నుంచి 50.60 డాలర్లకు పడిపోయింది. రూపాయి విలువ కూడా డాలరుతో పోలిస్తే కొద్దిగా మెరుగై 88.70 వద్ద నిలిచింది. ఫెడ్ నిర్ణయం స్పష్టత వచ్చే వరకు బంగారం, వెండి మార్కెట్లలో ఇలాంటి అస్థిరత కొనసాగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1 gram gold rate today
  • 10 gram gold price
  • 10 gram gold price 24 carat
  • 10 gram gold price in hyderabad
  • Gold Price Today
  • Latest Gold Price
  • Nov 15th Gold Price

Related News

Gold Price Down March 09

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కేజీ వెండి ధర రూ. 2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ,

  • Gold Rate

    Gold Price : దిగొస్తున్న పసిడి.. 4 రోజుల్లో రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd