Real Estate : హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్
Real Estate : గత కొద్దీ రోజులుగా నగరంలో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోతుండడం(Home sales are declining) తో రియల్ ఎస్టేట్ వారు తలలు పట్టుకుంటారు. మధ్యతరగతి ప్రజలు మాత్రం హమ్మయ్య అనుకుంటున్నారు
- By Sudheer Published Date - 11:51 AM, Tue - 6 May 25

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (Real Estate ) రంగం కాస్త నెమ్మదించగా, హైదరాబాద్ (Hyderabad) లో కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా నగరంలో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోతుండడం(Home sales are declining) తో రియల్ ఎస్టేట్ వారు తలలు పట్టుకుంటారు. మధ్యతరగతి ప్రజలు మాత్రం హమ్మయ్య అనుకుంటున్నారు. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనీ కలలు కంటూ ఎదురుచూస్తున్నవారికి ఇదే మంచి అవకాశం. ధరల తగ్గుదల వల్ల ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు కాస్త ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
China + Pakistan: పాక్ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?
హైదరాబాద్‌లో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న స్కై స్క్రాపర్లు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ప్రీమియం వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం ఎక్కువగా ఉన్నత వర్గాలకే పరిమితమవుతున్నాయి. అయితే ఈ లగ్జరీ ప్రాజెక్టుల్లో ఎస్ఎఫ్‌టీకి ధరలను పది వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకూ తగ్గిస్తే, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇవి కొనుగోలు చేయగలుగుతాయి. దీని వలన రియల్ ఎస్టేట్ రంగం కొత్త ప్రాణం పొందే అవకాశం ఉంది. ఇదే సమయంలో సాధారణ మధ్యతరగతి ప్రజలకు మామూలు అపార్ట్‌మెంట్లు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తే, రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత విస్తరించవచ్చు.
ఇక బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా ఇటీవల తగ్గుముఖం పడుతుండటం మరొక కలిసివచ్చిన అంశం. ఇది హోం లోన్లు తీసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీ భారం పెట్టి, ఇల్లు కొనుగోలు చేసే అవకాశాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో, హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం. సరైన ప్లాన్‌తో ముందడుగు వేస్తే, వారు మంచి ఇంటి కలను నిజం చేసుకునే అవకాశం ఉంది.