Dog Bites: కుక్కకాటు ఘటనలపై GHMC చర్యలు, స్ట్రీట్ డాగ్స్ పై యాక్షన్!
హైదరాబాద్ లో నిన్న ఒకేరోజు రెండు కుక్కకాటు ఘటనలు చోటుచేసుకున్నాయి.
- By Balu J Published Date - 11:55 AM, Sat - 16 December 23

Dog Bites: హైదరాబాద్ లో నిన్న ఒకేరోజు రెండు కుక్కకాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. దిల్‌షుఖ్ నగర్‌లో కుక్క కాటుకు గురైన సంఘటన నేపథ్యంలో, వీధికుక్కలను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. కార్పొరేషన్‌లోని వెటర్నరీ సిబ్బంది గురు, శుక్రవారాల్లో తొమ్మిది వీధి కుక్కలను పట్టుకున్నారని తెలిపారు.
కుక్కలకు స్టెరిలైజ్ చేసి ఫతుల్లాగూడలోని జీహెచ్‌ఎంసీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాటుకు గురైన బాలుడికి సమీపంలోని ఆసుపత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మరియు టెటానస్ టాక్సాయిడ్ (టిటి) ఇంజెక్షన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిపక్కలవారు అలర్ట్ కావడంతో కొద్దిలో ప్రాణప్రాయం తప్పింది.
అయినప్పటికీ బాలుడు గాయపడ్డారు. ఓ అపార్ట్ మెంట్ లో బాలుడు తన స్నేహితులతో ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడు తప్పించుకునేందుకు పరుగులు తీసినా కుక్క వెంటపడి కరిచింది. మరో ఘటనలో రెండేళ్ల బాలుడిని కుక్క నోట కరుచుకొని వెళ్లడం కలకలం రేపింది.
Also Read: State Government: కీలక ఫైళ్లు మిస్సింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్!