HYD : రాజేంద్రనగర్ లో భారీ పేలుడు..ఆరుగురి పరిస్థితి విషయం
- By Sudheer Published Date - 01:50 PM, Thu - 14 December 23

హైదరాబాద్ మహానగరంలో మరో గ్యాస్ పేలుడు (Gas explosion) సంభవించింది. రాజేంద్ర నగర్ (Rajendra Nagar) లోని కరాచీ బేకరీ (Karachi Bakery) లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన లో 15 మందికి తీవ్ర గాయాలు కాగా..ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
గాయపడ్డ వారిని చికిత్సకోసం 8మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా బీహార్ కు చెందినవారిగా గుర్తించారు. రాజేంద్రనగర్ లో ని కరాచీ బేకరిలో ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రమాదం ఎ లా జరిగిందనే దానిపై ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.