Gaddar Final Journey : గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం..
నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుంది
- By Sudheer Published Date - 01:33 PM, Mon - 7 August 23

ప్రజాగాయకుడు , విప్లవనేత గద్దర్ అంతిమయాత్ర LB స్టేడియం నుండి ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం గద్దర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గద్దర్ ఇకలేరు అనే వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , ఉద్యమకారులు , ప్రజా సంఘాల నేతలు , అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు గద్దర్ మరణ వార్త తట్టుకోలేకపోయారు. నిన్న సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని ప్రజలసందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు తీసుకురాగా..ప్రజలు, రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున గద్దర్ (Gaddar) ను కడసారి చూసేందుకు పోటెత్తారు.
నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుందని ప్రతి ఒక్కరు 2అంటున్నారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు, ప్రజాగాయకుడి మరణం రాష్ట్రానికే చాలా తీరని లోటని బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ ప్రముఖులు. నిన్న రాత్రే సినీ నటుడు , జనసేన అధినేత నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈరోజు ఉదయం నుండి కూడా అనేక రాజకీయ పార్టీల నేతలు గద్దర్ కు నివాళ్లు అర్పిస్తూ వచ్చారు.
ప్రస్తుతం ఆయన అంతిమయాత్ర (Gaddar Final Journey) LB స్టేడియం నుండి ప్రారంభమైంది. ఈ యాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి తొలుత గన్ పార్క్ కు గద్దర్ పార్థవదేహాన్ని తీసుకెళ్తారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని ఆయన ఇంటి వరకు యాత్ర కొనసాగుతుంది. గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచుతారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ..గద్దర్ కు నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి వెంకటాపురంలో ఉన్న మహాబోధి పాఠశాలకు చేరుకుంటుంది. గద్దర్ కోరిక మేరకు స్కూల్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Also : Gaddar – Pawan : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన పవన్ గురించి గద్దర్ చెప్పిన మాటలు