HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gaddam Prasad Kumar As Speaker Of Telangana Assembly

Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశాడు

  • Author : Sudheer Date : 07-12-2023 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaddam Prasad Kumar
Gaddam Prasad Kumar

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ను ఎన్నికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది. వికారాబాద్ ఎమ్మెల్యే (Vikarabad MLA) గా గడ్డం ప్రసాద్ కుమార్ విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశాడు. 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. గడ్డం ప్రసాద్‌కుమార్‌ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా పనిచేసారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క తెలంగాణ ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి (Revanth Reddy CM) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైదరాబాద్ లోని LB స్టేడియం లో ఈ వేడుక అట్టహాసంగా జరుగుతుంది. వేలాదిమంది ఈ వేడుకను చూసేందుకు తరలివచ్చారు. LB స్టేడియం చుట్టూ కాంగ్రెస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఇక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీగా నాయకుడిగా ప్రమోట్ చేస్తూ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మధ్యాహ్నం 1:04 నిమిషాలకు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా వేదికపైకి చేరుకున్నారు.

 

Read Also : Revanth Reddy Biopic : రేవంత్ బయోపిక్ ను ప్రకటించిన బండ్ల గణేష్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gaddam prasad kumar
  • revanth reddy
  • Telangana Assembly
  • Telangana Assembly Speaker

Related News

    Latest News

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • బంగ్లాదేశ్‌కు ప్ర‌ధాని మోదీ?!

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

    Trending News

      • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

      • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

      • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

      • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

      • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd