Bogatha Waterfall: బొగత జలపాతం ఉగ్రరూపం, టూరిస్టులకు నో ఎంట్రీ
తెలంగాణలోని ములుగు జిల్లాలోని జలపాతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
- Author : Balu J
Date : 19-07-2023 - 12:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని ములుగు జిల్లాలోని జలపాతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఈ మూడు జలపాతాల్లోకి ప్రవహించడంతో బొగత, ముత్యాలదార జలపథం, కొంగల వాటర్ ఫాల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ములుగు జిల్లాలోని మూడు జలపాతాలు కళకళలాడుతున్నాయి.
అయితే గత మూడు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతం లోయలోకి అత్యధికంగా వరదనీరు చేరడంతో బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రమాదాలు సంభవిస్తాయని పసిగట్టిన అటవీశాఖ అధికారులు, ములుగు జిల్లా అధికారి ఆదేశాల మేరకు బొగత జలపాతం సందర్శన బుధవారం ఉదయం నుండి నిలుపుదల చేసినట్లు రేంజర్ చంద్రమౌళి తెలిపారు
జలపాతాలను చేరుకోవడానికి పర్యాటకులకు స్థానిక గిరిజన గైడ్‌లు అవసరం. స్థానిక గైడ్‌ల సహాయం లేకుండా అటవీ సిబ్బంది పర్యాటకులను జలపాతాల వద్దకు ట్రెక్కింగ్ చేయడానికి అనుమతించడం లేదు. చంద్రమౌళి ప్రకారం, జలపాతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా స్థానిక పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచారు.
Also Read: Mahesh Babu: రెమ్యూనరేషన్ లో మహేష్ బాబు రికార్డ్, గుంటూరు కారం మూవీకి అన్ని కోట్లా!