Sankrnathi Free Bus : సంక్రాంతికి కూడా ఉచితమేనట..
- By Sudheer Published Date - 02:47 PM, Thu - 4 January 24

మరో వారంలో సంక్రాంతి (Sankrnathi ) సంబరాలు మొదలుకాబోతున్నాయి..ఇప్పటికే సంక్రాంతికి సొంతళ్లుకు వెళ్లే వారు వారి వారి ప్లాన్ లలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో మహిళలకు ఉచిత బస్సు (Women Free Bus) సౌకర్యం ఉండదనే వార్త వైరల్ గా మారింది. సంక్రాంతి టైములో TSRTC మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసేయబోతుందని..ఆ సమయంలో టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిందే అని సోషల్ మీడియా లో పలు వార్తలు ప్రచారం అవ్వడం తో ఈ వార్తలు చూసిన వారంతా నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో TSRTC ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
సంక్రాంతికి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి ఉచిత బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరో వైపు అద్దె బస్సు యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం అయ్యాయి. అద్దె బస్సు యజమానులు కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వారం రోజుల్లో అద్దె బస్సుల యజమానుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామన్నారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయన్నారు.
Read Also : Jagan at Lotus Pond : రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ ఇంటికి జగన్..